Site icon Prime9

Prabhas: హీరో ప్రభాస్ కు కోర్టు నోటీసులు..!

delhi-high-court-issues-notice-to-hero-prabhas

delhi-high-court-issues-notice-to-hero-prabhas

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియనివారుండరు. దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ డార్లింగ్ కు తాజాగా కోర్టు నోటీసులు అందాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదిపురుష్. అయితే ఈ మూవీ హిందువుల్లోని ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.

ప్రభాస్ హీరోగా కృతిసనన్ హీరోయిన్ రామయణ ఇతివృత్తంతో రూపొందుతున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు ఓం రౌత్ తెరక్కెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమ టీజర్ ఇటీవలె విడుదలయ్యి అనేక విమర్శలకు ఎదుర్కొంటున్న సంగతి తెలిసింది. ఈ చిత్రంలో రావణుడి పాత్రపై మరియు రాముడి పాత్రపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. బొమ్మల సినిమాలా ఉందంటూ కొందరు కామెంట్లు చేశారు. కాగా రావణాసురిడి రోల్ పై అయితే అనేక కామెంట్లు వచ్చాయి. ముస్లింలా ఉన్నాడంటూ, క్రాస్ బ్రీడ్ అంటూ వివిధ రకాల కామెంట్లు చేసారు నెటిజన్లు.

ఇదిలా ఉంటే ఈ చిత్రం హిందువుల్లోని ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఢిల్లీ కోర్టులో ఈ చిత్ర యూనిట్ పై పిటిషన్ దాఖలయ్యింది. దీనితో ప్రభాస్ సహా చిత్ర బృందానికి ఢిల్లీ కోర్టు నోటిసులు జారీ చేసింది. పిటిషన్ దారుల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలంటూ మూవీ మేకర్స్ ను కోర్ట్ ఆదేశించింది.

ఇదీ చదవండి: కీర్తి సురేష్ నయా లుక్.. ఈ మహానటి ఫొటోలు చూస్తే షాక్..!

Exit mobile version