Site icon Prime9

Infosys Narayana Murthy: ఆ దగ్గు మందు మరణాలు సిగ్గుచేటు.. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

death-of-66-children-in-gambia-has-brought-unimaginable-shame-to-india- infosys narayana-murthy

death-of-66-children-in-gambia-has-brought-unimaginable-shame-to-india- infosys narayana-murthy

Infosys Narayana Murthy: మనదేశంలో తయారైన దగ్గు మందుతో జాంబియాలో 66 మంది చిన్నారులు మరణించినట్లు మొన్నామధ్య కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆ వార్తలపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి స్పందించారు. మన దగ్గర తయరైన దగ్గుమంతో జాంబియాలో చిన్నారు మృత్యవాత పడినట్టు ఆఫ్రికా ఆరోపించడం భారత్‌కు సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.

మంగళవారం బెంగళూరులో నిర్వహించిన ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా టీకాలను తయారు చేసి, విదేశాలకు ఎగుమతి చేసినా దగ్గు మందు అపవాదం భారత పరిశోధన రంగానికి మచ్చ తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. విజ్ఞాన పరిశోధనల్లో సమన్వయ లోపంతోపాటు నిధులు సమకూర్చడంతో విద్యాసంస్థలు అవస్థలు పడుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సకాలంలో పొందలేకపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. సహజంగా భారతీయులు ఎదుర్కొనే డెంగీ లాంటి వ్యాధులకు ఇంకా టీకాలు కనిపెట్టలేక పోవడం పరిశోధన రంగం వైఫల్యమేనని నారాయణమూర్తి పేర్కొన్నారు.

ఇకపోతే అత్యుత్తమ పరిశోధనలు, యువతకు స్ఫూర్తి కలిగించిన ఆరుగురు శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ పురస్కారాలు ప్రకటించింది. సుమన్‌ చక్రవర్తి (ఇంజినీరింగ్‌ కంప్యూటర్‌ సైన్స్‌), సుధీర్‌ కృష్ణస్వామి (హ్యూమనిటీస్‌), విధిత వైద్య (లైఫ్‌ సైన్సెస్‌), మహేశ్‌ కాక్డే (గణితం), నిస్సీమ్‌ కనేకర్‌ (భౌతిక శాస్త్రం), రోహిణి పాండే (సోషల్‌ సైన్స్‌)లకు పురస్కారాలను ప్రకటించారు. విజేతలకు స్వర్ణ పతకంతోపాటు లక్ష అమెరికన్‌ డాలర్లను అందజేశారు. ఈ ఏడాది మొత్తం 218 నామినేషన్లు రాగా వీరిని ఎంపిక చేశారు. జనవరిలో పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్‌ అధ్యక్షుడు క్రిస్‌ గోపాలకృష్ణన్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి: అమెజాన్ లో 10000 ఉద్యోగాలు కోత..!

Exit mobile version