Site icon Prime9

Dasoju Sravan Kumar: టీ కాంగ్రెస్ కు మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్

Hyderabad: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలో మరొక వికెట్ పడింది. పార్టీకి కీలక నేత దాసోజు శ్రవణ్‌ రాజీనామా చేశారు. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టి.కాంగ్రెస్‌లో విజయారెడ్డి (Vijayareddy) చేరికపై దాసోజు శ్రవణ్‌ అసంతృప్తితో ఉన్నారు. దీనితోనే నేడు ఆయన తన రాజీనామాను ప్రకటించారని సమాచారం.

మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోమటిరెడ్డి బ్రదర్స్ కలవనున్నారు. పార్టీ మారుతున్నది రాజగోపాల్‌రెడ్డి అయితే ఆయనతో పాటు వెంకటరెడ్డి కూడా కలవనుండటం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version