Site icon Prime9

Komatireddy Venkat Reddy: సోనియా, రాహుల్ దగ్గరే తేల్చుకుంటాను.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Hyderabad: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. చండూరు సభలో తనను అసభ్యకరంగా తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్ కూడా విడుదల కాకముందే రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు.

నన్ను వైన్స్‌లో పనిచేసేవాళ్లతో పోలుస్తారా, నన్ను హోంగార్డుతో పోల్చారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. మునుగోడు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. సోనియా, రాహుల్ దగ్గరే తేల్చుకుంటాను. కాంగ్రెస్ ను మాత్రం వీడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version