68th National Film Awards: కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన కలర్ ఫొటో ఎంపికైంది.
ఉత్తమ సంగీత దర్శకుడిగా అల వైకుంఠపురములో చిత్రానికి గానూ తమన్‌కు అవార్డు వరించింది. ఇక ముందుగా ఊహించినట్లుగానే సూర్య సూరరై పొట్రు(ఆకాశమే నీ హద్దురా) చిత్రానికి ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. బెస్ట్ క్రిటిక్ అవార్డు ప్రకటనను మాత్రం వాయిదా వేసింది. మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌గా మధ్యప్రదేశ్ నిలిచింది.
మరోవైపు మరో చిన్న చిత్రం నాట్యం రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అందులో ఒకటి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కోసం టీవీ రాంబాబుకు అవార్డు దక్కింది. ఈ చిత్రానికి సంధ్యా రాజు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును కైవసం చేసుకున్నారు. అల వైకుంఠపురములో మరెన్నో అవార్డులు వస్తాయని సినీ ప్రేమికులు అనుకున్నారు కానీ ఒక్క అవార్డుతో సరిపెట్టుకోవలసి వచ్చింది.