Weather Updates: చలి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది పదిగంటలైనా పొగమంచు వీడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది.

Weather Updates: తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది పదిగంటలైనా పొగమంచు వీడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది.

ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కి పడిపోతుండటంతో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు నానాటికి పడిపోతున్నాయి. దానితో చలి అధికంగా పెరిగిపోతుంది. నేడు ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమురంభీం జిల్లాలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 7.5 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 8.3, నిర్మల్‌ జిల్లాలో 9.2, మెదక్‌ జిల్లా లింగాయిపల్లిలో 9.2, మంచిర్యాల జిల్లాలో 9.5, సిద్దిపేట జిల్లా హబ్సిపూర్‌లో 10.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న రెండు రోజుల్లో రాత్రిపూట చలి మరింత తీవ్రమవుతుందని వెల్లడించింది.

ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో హంగ్ రావాలని బీజేపీ భావిస్తోందా?