Site icon Prime9

Chiranjeevi Wishes: బ్రహ్మనందం బర్త్ డే.. ఘనంగా సెలబ్రేట్ చేసిన చిరంజీవి

chiru wishes

chiru wishes

Chiranjeevi Wishes: హాస్యబ్రహ్మా బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బ్రహ్మనందం పుట్టినరోజు సందర్భంగా.. మెుదట చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్. ఈరోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చెయ్యక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లి విరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయ పూర్వక శుభాభినందనలు. బ్రహ్మనందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ.. పది మందిని నవ్విస్తూ ఉండాలని.. బ్రహ్మానందంకి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని..తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్పూర్తిగా ఆశిస్తూ.. తనకి నా జన్మదిన శుభాకాంక్షలు.. అంటూ ట్వీట్ చేశారు

పుట్టిన రోజుని ఘనంగా సెలెబ్రేట్ చేసిన మెగాస్టార్

హాస్యానికి కూడా రూపం ఉంటుంది అంటే అది బ్రహ్మానందం రూపంలో అనేలా ఉంటుంది.

తన కామెడీ టైమింగ్ లో మనందరిని నవ్విస్తూ ఉంటారు హాస్ బ్రహ్మ.

తన మీమ్స్ తో ఎంతో మందిని నవ్వించే.. మీమ్ గాడ్ కి అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. స్వయంగా మెగాస్టార్ బ్రహ్మీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

బ్రహ్మానందంకి ఫ్లవర్ బొకే ఇచ్చి.. ఆయన పుట్టిన రోజుని చిరంజీవి Megastar Chiranjeeviసెలబ్రెట్ చేశారు.
ఇక దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

కొంత కాలంగా సినిమాల్లో బ్రహ్మనందం పెద్దగా కనిపించడం లేదు.

ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కొత్త ప్రాజెక్ట్ కీడా కోలాలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మి విభిన్న పాత్రలో నటించనున్నాడు.

Nara Lokesh : ఫ్లెక్సీల ధ్వంసంపై మండిపడ్డ నారా లోకేష్ | Prime9 News

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar