Site icon Prime9

Chandrababu Naidu: రేపటి నుంచి వరదప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

diwali wishes from chandrababu

diwali wishes from chandrababu

Andhra Pradesh: ఈ నెల 20, 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు20న కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో 21న కూనవరం, చింతూరు, ఏటపాక, వీఆర్‌పురం మండలాల్లో 22న పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటించనున్నారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో వైసీపీ సర్కారు విఫలమైందని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో బాధితులకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముంపు ప్రాంతాల ప్రజలపట్ల జగన్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాబు ఆరోపించారు. కాలు కింద పెట్టకుండా హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే చేస్తే ప్రజల కష్టాలు ఎలా తీరతాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Exit mobile version