Site icon Prime9

Chandrababu: టమాటోలు రెండు కిలోలు రూ.5 వేలు.. కుప్పంలో కొని పంచిన చంద్రబాబు

chandrababu tomatoes

chandrababu tomatoes

Chandrababu: చంద్రబాబు తెలుగుదేశం బలోపేతానికి వయసుకి మించి శ్రమిస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రోడ్డుషోల్లో పోయిన ప్రాణాల గురించి పెను దుమారం నడుస్తున్న తరుణంలో ఆయన ప్రస్తుత చర్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని గుడుపల్లి మండలం సంగనపల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది.

మార్గమధ్యంలో టమోటాలు అమ్మే బండి ఆయనకి కనపడంతో అక్కడ ఆగారు.

ఆ చిరు వ్యాపారి పరీస్థితులు, వ్యాపారం ఎలా సాగుతుంది, రాబడి ఎంత ఉంటుంది, చేతికి ఎంత మిగులుతుంది అని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అక్కడకి చంద్రబాబుని చూడటానికి వచ్చిన జనానికి ఆ టమోటాలని ఆయనే కొని పంచారు.

ఒక్కో కేజీ పంచుతూ వారితో మాట్లాడుతూ, వారి పరిస్థితులు అడిగి తెలుసుకుంటూ ప్రక్రియ కొనసాగింది.

అయితే అసలు విషయం ఏంటి అంటే ఒక్కో కేజీ రూ. 1000 నుండి 2000 వరుకు ఇచ్చి టొమాటోలని కొన్నట్టు తెలుస్తోంది.

ఆ విక్రయాదారుడి రేపటి పరిస్థితి ప్రశ్నార్ధకం..!

ఇవాళ అంటే అదృష్టం కొద్దీ అక్కడ జరిగిన పర్యటనలో చంద్రబాబు (Chandrababu) దృష్టికి ఈ టమాటో బండి రావడంతో కేజీ రూ.  2000 రాబడి వచ్చింది కానీ రేపటి నుండి కొనడానికి చంద్రబాబు ఉండడు, చంద్రబాబు కి అమ్మే పరిస్థితి ఈ టమాటో విక్రయదారునికి ఉండదు. కనీస మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులు, విక్రయదారులు తమ సమస్యలు తీరేదెన్నడో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కందుకూరు, గుంటూరు ఘటనలతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీ. వో. నం 1 అమలులో ఉండగా మొన్న చంద్రబాబు కుప్పంలో  పర్యటించే వాహనాన్ని నిభందనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ  పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఆ జీవోకి  అనుగుణంగా, ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు పెట్టె అవకాశం లేకుండా చిత్తూరు సభను నిర్వహించామని టిడిపి నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు మరి రానున్న రోజుల్లో ప్రభుత్వంపై ఏ విధంగా యుద్ధం ప్రకటించనున్నారు అనేది వేచి చూడాలి.

మరిన్ని చదవండి

Janasena Party : వైసీపీ ముగ్గుల పోటీల్లో జై జనసేన అన్న యువతి.. అంబటి రాంబాబుకి షాక్

Balakrishna: పొగమంచు కారణంగా బాలకృష్ణ హెలికాప్టర్ అత్యవరస ల్యాండింగ్

Mekapati Chandrashekar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి భార్య కొడుకుని అంటూ.. బహిరంగ లేఖ.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version