Site icon Prime9

#BOYCOTTIPL: టీమిండియా ఓటమితో ట్రెండ్ అవుతున్న “#బాయ్‌కాట్ ఐపీఎల్.. వి మిస్ యూ ధోని”

#BOYCOTTIPL trending in twitter team india after loosing t20 semi final match

#BOYCOTTIPL trending in twitter team india after loosing t20 semi final match

#BOYCOTTIPL: టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్‌లో భారత క్రికెట్‌ జట్టు ఘోర పరాభవం చెందింది. దీనితో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చెయ్యగా అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు టీమిండియాను చిత్తుచిత్తుగా ఓడించింది. దీంతో భారత్ మరోసారి నిరాశతో ఇంటిముఖం పట్టింది. ఈ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐపీఎల్ వల్లే భారత కీలక ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారని, వాళ్ల ఏకాగ్రత దెబ్బతింటోందని, వాళ్లు దేశం కోసం కాకుండా డబ్బు కోసం ఆడుతున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భారతజట్టు ఓడిపోయినప్పటి నుండి #BOYCOTTIPL ట్యాగ్ ట్విట్టర్‌లో తెగ ట్రెండింగ్ లో ఉంది. తమకు కావాల్సింది ఐసీసీ టోర్నమెంట్లు కానీ ఐపీఎల్ కప్పులు కాదని క్రికెట్ లవర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఐపిఎల్ ట్రోఫీలను గెలుచిన రోహిత్ శర్మ సెమీ-ఫైనల్‌లో చాలా పేలవంగా ఆటతీరు కనపర్చడమే కాకుండా కెప్టెన్సీలో కూడా చాలా నిరాశ కనపరిచారంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఐపీఎల్ ఆటతీరును బేరీజు వేసుకుని ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్న సెలక్టర్లకు కూడా ఇది అవమానకర ఓటమి అంటూ ఐపీఎల్‌ని నిషేధించాలని భారత క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే మరోవైపు మహేంద్ర సింగ్ ధోనిని క్రికెట్ అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. దేశానికి మూడు అంతర్జాతీయ ట్రోఫీలు (2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ) తెచ్చిపెట్టిన ఘనత ధోనికే దక్కిందని వి మిస్ యూ ధోనీ అంటూ నెటిజన్లు మిస్టర్ కూల్ ను తలచుకుంటున్నారు.


ఇదీ చదవండి: విరాట్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. టీ20ల్లో అగ్రస్థానం

Exit mobile version
Skip to toolbar