Site icon Prime9

Bjp Vishnuvardhan Reddy: బీజేపీతో పెట్టుకుంటే.. అగ్గితో తల గోక్కున్నట్టే- విష్ణువర్దన్ రెడ్డి సవాల్

bjp vishnu vardhan reddy

bjp vishnu vardhan reddy

Bjp Vishnuvardhan Reddy: మూడున్నరేళ్లులో ఒక్క అభివృద్ది పనులు చేశామని ఎలక్షన్ కి వెళ్లగలిగే దైర్యం ఉందా..? ఏపీ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.

ప్రభుత్వం ప్రభుత్వం‌ మీద ఫిర్యాదు చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రజా చార్జ్ షీట్స్ ను వేసి ప్రజల ముందు ఉంచుతామన్నారు. 2024 లో ఏపీ రాజకీయ భవిష్యత్ నిర్ణయించే సమావేశం బీజేపీ ఆధ్వర్యంలో భీమవరం లో జరిగిందన్నారు.

జగన్ అమరావతిని ముంచేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భావి తరాలకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు అసమర్ద పాలన వల్లే..

ఐదేళ్లు ఏపీని చంద్రబాబు సగం సర్వనాశనం చేశారని.. 2000 కోట్లు ఇస్తే కనీసం అసెంబ్లీ కూడా కట్టలేకపోయారన్నారు.

చంద్రబాబు అసమర్ద నిర్ణయాల వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని విమర్శంచారు.

మా పార్టితోనే కలిస్తే రాష్ట్రం రక్షింపబడుతుంది అని కొందరు చెబుతున్నారని.. టీడీపీతో , వైసీపీతో కలిస్తే రాష్ట్రాన్ని భక్షింపబడుతుంది గానీ రక్షింపబడదని అన్నారు.

అనైతికంగా బీజేపీ కి చెందిన ఎవరినైనా.. వేరే పార్టీలో చేర్చుకుంటామంటే అగ్గితో తల గోక్కున్నట్టేనని హెచ్చరించారు.

ఉండవల్లులకు , ఊసరవెల్లులకు ఇప్పుడే పోలవరం ,హోదా & కేంద్ర నిధులు గుర్తుకువస్తాయన్నారు.

బీజేపీ, జనసేనలకు స్పష్టత ఉంది

పక్క రాష్ట్రంలో ఒకరికి కేసులు, ఒకరికి ఆస్తులు ఉన్న మీరు కేసీఆర్ కే భయపడుతుంటే.. ఇక బీజేపీని ఏం బెదిరిస్తారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో రెండు కుటుంబ పార్టీల్లో ఒక కుటుంబ జెండా పీకేయడం ఖాయమని తెలిపారు. మా ముఖ్యమంత్రి అభ్యర్దిగా ఎవరిని పెట్టుకోవాలో మాకు తెలీదా..?

మా బ్రాండ్ అంబాసిడర్ మోదీ మాత్రమే ఆయన ఫోటోతోనే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు.

కన్నా లక్ష్మినారాయణ పార్టీ మారుతున్నానని ఎవరికైనా చెప్పారా అని ప్రశ్నించారు. జీవో 1 తీసుకురావడానికి ప్రధాన కారణం టీడీపీనే అని ఆరోపించారు.

సభలు పెట్టి ఎంతోమంది ప్రాణాలు పోతే కనీసం ప్రచారం ఆపలేదని.. మరణాలపై కుట్ర ఉందన్నారు కానీ ఫిర్యాదు చేయలేదన్నారు.

పొత్తులపై బీజేపీ, జనసేన పార్టీలకు స్పష్టమైన అవగాహన ఉందని.. అది పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పారన్నారు.

బీజేపీ ,జనసేన కలిసే ఎన్నికలకు వెళతాలమని.. ఇద్దరి కలయికలను చెడగొట్టడానికి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version