Site icon Prime9

Banks: డిసెంబర్​​లో 14 రోజులు సెలవులు

bank holidays in December 2022

bank holidays in December 2022

Banks: డిసెంబర్​​ నెల ప్రారంభం అవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల వివరాలను
ఆర్​బీఐ ప్రకటించింది. డిసెంబర్​​లో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. అయితే వీటిల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి.
ఇక బ్యాంకు ఖాతాదారాలు ఈ లిస్ట్​ను గుర్తించి సెలవు లేని రోజు చూసుకుని బ్యాంక్​కు వెళ్లాల్సి ఉంటుంది.

ప్రాంతీయ​ సెలవుల వివరాలు..
డిసెంబర్​ 3: ఫీస్ట్​ ఆఫ్​ సెంట్​ జేవియర్స్​. గోవా బ్యాంక్​లకు సెలవు
డిసెంబర్​ 12: పా టోగాన్​ నెంగ్​మింజా సంగ్మ. షిల్లాంగ్​లో బ్యాంక్​లకు సెలవు
డిసెంబర్​ 19: గోవా లిబరేషన్​ డే. గోవా బ్యాంక్​లకు సెలవు
డిసెంబర్​ 24: క్రిస్ట్​మస్​ ఈవ్​. షిల్లాంగ్​ బ్యాంక్​లకు సెలవు
డిసెంబర్​ 26: క్రిస్ట్​మస్​ సెలబ్రేషన్స్​/లూసాంగ్​/నామ్​సాంగ్​- ఐజాల్​, గ్యాంగ్​టక్​, షిల్లాంగ్​ బ్యాంక్​లకు సెలవు
డిసెంబర్​ 29: గురు గోబింద్​ సింగ్​ జయంతి. ఛండీగడ్​ బ్యాంక్​లకు సెలవు
డిసెంబర్​ 30: యూ కియాంగ్​ నంగ్​బాఘ్​. షిల్లాంగ్​ బ్యాంక్​లకు సెలవు
డిసెంబర్​ 31: న్యూ ఈయర్​ ఈవ్​, ఐజాల్​ బ్యాంక్​లకు సెలవు

సాధారణ సెలవులు..
డిసెంబర్​ 4: ఆదివారం
డిసెంబర్​ 10: రెండో శనివారం
డిసెంబర్​ 11: ఆదివారం
డిసెంబర్​ 18: ఆదివారం
డిసెంబర్​ 24: నాలుగో శనివారం
డిసెంబర్​ 25: క్రిస్ట్​మస్​, ఆదివారం

ఇదీ చదవండి: ట్వీట్ సైజ్​ను పెంచనున్న ట్విట్టర్

Exit mobile version