Bandi Sanjay Comments: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. సచివాలయం డోమ్ లు కూల్చివేస్తామని హెచ్చరిక

Bandi Sanjay Comments: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. నూతనంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం డోమ్ లను కూల్చివేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Bandi Sanjay Comments: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. నూతనంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం డోమ్ లను కూల్చివేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో రాజకీయం వెడేక్కుతోంది. ఓ వైపు శాసనసభా సమావేశాలు జరుగుతుండగానే.. మరోవైపు బండి సంజయ్, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చివేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఈ వివాదం సద్దుమణగకముందే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగనే.. నూతన సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తాము అధికారంలోని రాగానే నూతన సచివాలయంలో మార్పులు చేస్తామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మార్పులు చేస్తామని తెలిపారు. భాజపా అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లను కూల్చివేస్తామని తెలిపారు. ఇక ప్రగతి భవన్ ను కూడా ప్రజా దర్బారుగా మారుస్తామని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో చర్చనీయాశంగా మారాయి.

కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా.. బండి సంజయ్ Bandi Sanjay సవాల్ విసిరారు. రోడ్లకు అడ్డుగా ఉన్న గుళ్లు, మసీదులను కూల్చేస్తామని కేటీఆర్‌ Minister KTR అంటున్నారు. అదే కేటీఆర్ కు దమ్ముంటే.. దమ్ముంటే పాతబస్తీ నుంచే ఇది మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ తెలంగాణను ఎంఐఎంకి కట్టబెట్టాలని చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్, ఎంఐఎం రెండు ఒక్కటే పార్టీలని.. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. డిపాజిట్లు రాకుండా చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

తెలంగాణలో నిజాం రాజ్యం పోయి.. మన రాజ్యం రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కరెంట్‌ ఇవ్వడం లేదని.. పొలాలు ఎండిపోతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. పాతబస్తీలో యువతకు పాస్‌పోర్టులు ఎందుకు రావడంలేదో ఎంఐఎం నేతలు ఆలోచించుకోవాలని హితవు పలికారు. దేశంలో ఎక్కడ ఎలాంటి ఘటనా జరిగినా పాతబస్తీకి చెందిన వ్యక్తులే ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు.