Site icon Prime9

Bandi Sanjay: కిషన్ పాదయాత్ర.. బండి ప్రజా సంగ్రామ యాత్ర

bandi-sanjay-padayatra-from-tomorrow and kishan reddy padayatra in secunderabad

bandi-sanjay-padayatra-from-tomorrow and kishan reddy padayatra in secunderabad

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నుంచి నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేయనున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కాగా ఈ నేపథ్యంలో భైంసాలో నిర్వహించే ప్రారంభ సభకు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకానున్నారు.

ఇదిలా ఉంటే నేడు అనగా ఆదివారం సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత తొందరగా వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు నడుస్తున్నారు. ఎక్కువగా ప్రజల నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించే ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పాటుకు ప్రాణాలైనా ఇస్తాను.. మర్రి శశిధర్ రెడ్డి

Exit mobile version