Site icon Prime9

NBK Unstoppable 2: అన్‌స్టాప‌బుల్ సీజన్-2 ట్రైలర్ డేట్ ఫిక్స్.. కౌ బాయ్‌ గెటప్‌లో బాలయ్య

unstoppable season 2 trailer release date fix

unstoppable season 2 trailer release date fix

NBK Unstoppable 2: నటసింహం నందమూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాప‌బుల్’ షో ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కాగా ఎప్పుడెప్పుడు అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 వస్తుందా అని బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే సీజన్ 1లో బాలయ్య చేసిన సందడికి ఆహా బాలయ్య నీ రూటే సపరేటయ్య అనక మానరు. బాలయ్యకు ఎంత కోపం ఉంటుందో అంతకు రెట్టింపు ప్రేమ ఉంటుందని అందరూ అంటుంటారు కానీ అంతే చిన్నపిల్లాడి మనస్థత్వం ఉంటుందని సరదాసరదాగా మాట్లాడతారనేది మాత్రం ఈ షో ద్వారానే ప్రేక్షకులకు తెలిసింది.

‘ఆహా’ వేదిక‌గా తెరకెక్కిన అన్‌స్టాప‌బుల్ షోకు విశేష ఆద‌ర‌ణ లభించింది. ఈ నేపథ్యంలోనే ‘అన్‌స్టాప‌బుల్’ రెండో సీజ‌న్ స్టార్ట్ చేస్తున్న‌ట్లు ఇటీవ‌లే ఆహా సంస్థ ప్ర‌క‌టించిన విష‌యం విదితమే. కాగా మ‌రి కొద్ది రోజుల్లో సీజ‌న్‌-2 ప్రారంభం కానుంది. అయితే ఇప్ప‌టికే సెలబ్రెటీల లిస్ట్‌ కూడా రెడీ అయినట్టు సమాచారం. ఈసారి షోకు పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవి, ప్రభాస్‌, అనుష్క, త్రివిక్రమ్‌ వంటి పలువురు ప్రముఖ స్టార్‌లు రానున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉండగా తాజాగా అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 ట్రైలర్‌ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. అక్టోబర్‌ 4న ఈ షోకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బాలయ్య గెటప్ అదుర్స అనుకోండి. బాలయ్య కౌ బాయ్‌ గెటప్‌లో వెనక్కి తిరిగి ఉన్నట్టుగా ఇందులో కనిపిస్తాడు. అయితే కొద్దిసేపటికే బాల‌య్య పోస్ట‌ర్‌ల‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది.

ఇదీ చదవండి: ఆ ఆలయమంతా డబ్బు, బంగారమే..!

Exit mobile version