Site icon Prime9

Unstoppable Show : రేయ్ ఎం చెబుతున్నావ్ డార్లింగ్ అంటున్న ప్రభాస్… వైరల్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ గ్లింప్స్ !

balakrishna unstoppable prabhas episode glimpse goes viral on media

balakrishna unstoppable prabhas episode glimpse goes viral on media

Unstoppable Show : నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. తనదైన డైలాగ్ లతో షో ని సూపర్ హిట్ చేశారు బాలయ్య. ఈ షో లో రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ తో కలిసి పాల్గొన బోతున్న విషయం అందరికీ తెలిసిందే. బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తెలుగులో టాక్ షో పాల్గొనడం ఇదే మొదటి సారి. తన గత చిత్రాల ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొన్నప్పటికి ఈ విధంగా టాక్ షో లో ముఖ్యంగా బాలకృష్ణతో వేదిక షేర్ చేసుకోవడం మొదటిసారి అని చెప్పాలి. దీంతో ఈ ఎపిసోడ్ కోసం అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ప్రభాస్… మరో వైపు ఇటీవలే ఆయన పెద నాన్న కృష్ణం రాజుని కూడా కోల్పోవడం వంటి పరిణామాల మధ్య డార్లింగ్ ఎం మాట్లాడతారు అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలోనే ఫ్యాన్స్ కి మరో ట్రీట్ ఇచ్చింది ఆహా టీం. తాజాగా ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో బాలయ్య ఎప్పటిలానే కళ్లద్దాలు గాల్లోకి విసురుతుండగా… బాహుబలి మీట్స్ బాలయ్య అని టైటిల్ రాగానే ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రేయ్ ఏం చెబుతున్నావ్ డార్లింగ్ అంటూ ఎవర్నో చూస్తూ ప్రభాస్ సరదాగా చెప్పడం గమనించవచ్చు. ఇక ఈ సంధర్భంగానే గోపిచంద్, ప్రభాస్ గురించి ఏదో చేపపతున్నట్లు అందుకు ప్రభాస్ సిగ్గు పడుతున్నట్లు కనిపిస్తుంది.

నవ్వుతూ హుషారుగా కనిపించిన ప్రభాస్ ను బాలకృష్ణ ఆటపట్టిస్తూ కనిపించారు. త్వరలో మొయిన్ ప్రోమో విడుదల కానుంది. ఈ ఎడిసోడ్ ను క్రిస్మస్ కానుకగా ప్రసారం చేస్తారని సమాచారం అందుతుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ కూడా కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version