Site icon Prime9

BRS Party : సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు.. వారి ఫోటోలతో?

ap state wide brs party flexys about sankranthi

ap state wide brs party flexys about sankranthi

BRS Party :  ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

కాగా ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ శ్రేణులు సంక్రాంతిని పురస్కరించుకొని పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ మేరకు ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి.

గుంటూరు, విజయవాడ, యానాం, కొత్తపేట, కడియం, కాకినాడ, ముమ్మిడివరం సహా పలు పట్టణాలు, నగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లెక్సీలు, హోర్డింగులలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫొటోలు కూడా ఉన్నాయి.

ఇటీవలే దేశ రాజకీయలలోకి ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది.

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ నియమించారు.

అలాగే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్థసారథి, మరికొందరు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.

మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఇప్పటికే.. సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తోంది.

హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రా ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.

ఒకప్పుడు ఆంధ్రులను అవమానించిన కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ప్లెక్సీలు, పోస్టర్లతో ప్రచారం చేసుకోవడం గమనార్హం.

ఖమ్మం సభ కోసం ఏపీ నేతలు..

కాగా ఈ నెల 18న ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సహా పలువురు నేతలు హాజరు కానున్నారు.

ఈ సభ కోసం ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సభకు సాధ్యమైనంత వరకూ సమీప ప్రాంతాలైన ఏపీ ప్రజల్ని కూడా ప్రభావితం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది.

అందుకే సరిహద్దు జిల్లాలను సభ కోసం ఎంపిక చేసుకున్నారు.

ఈ భారీ ఎత్తున నిర్వహించే సభలో కేసీఆర్ చేసే ప్రసంగం గట్టి మెసేజ్ ఇస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సక్సెస్ చేసే బాధ్యత మంత్రి హరీశ్ రావుకు అప్పగించడంతో రెండు రోజులుగా ఆయన అక్కడే మకాం వేశారు.

దేశ రాజకీయాలను ఖమ్మం సభ మలుపు తిప్పుతుంది : హరీష్ రావు

ఈ మేరకు జిల్లాల్లో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు హరీశ్ రావు.

తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

కాగా ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. దేశ రాజకీయాలను మలుపు తిప్పబోయే సభ ఖమ్మంలో జరగబోతోందన్నారు.

దేశం మొత్తం తెలంగాణ పథకాలను తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకునే స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారన్నారు.

తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచ్చేస్తున్నారన్నారు.

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా వస్తారని తెలిపారు.

ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ ల విషయం ఏపీ, తెలంగాణ లలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version