Ambati Rambabu : మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై మళ్ళీ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ను రిలీజ్ చేశారు. ఆ వీడియో లో అంబటి రాంబాబు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం 5 శాతం కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ హరిరామ జోగయ్య దీక్ష చేయడం, విరమించడం అందరికీ తెలిసిందే.
ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్… హరిరామ జోగయ్యతో మాట్లాడి, సంప్రదింపులు చేసి దీక్షను విరమింపజేయడం మంచిదన్నారు. కానీ గతంలో తెదేపా హయాంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి చేయకుండా మాట తప్పిన చంద్రబాబు పై ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున్న ఉద్యమం చేస్తే … ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి కాపులపై, ముద్రగడ పద్మనాభం పై తెదేపా కేసులు పెట్టి వారి కుటుంబాలను కూడా చిత్ర హింసలు పెట్టి వేదించినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి ముందుకు రాలేదని ఆరోపించారు. ఆరోజున పవన్ ఎక్కడ దాక్కున్నారో తెలియదన్నారు.
ఇప్పడు హరి రామ జోగయ్య గారిని దీక్ష విరమింపజేయడానికి పవన్ ముందుకు రావడం ముఖ్య పాత్ర పోషించడం మంచిదన్నారు. కాకపోతే కాపు సోదరులు గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కాపులు ధర్నాలు చేస్తే మద్దతు ఇవ్వని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంలో మాత్రం ధర్నాలు చేస్తే మాత్రం మద్దతు ఇస్తారని ఇదెక్కడి లాజిక్ అని .. కాపు సోదరులు అంతా దీన్ని ఆలోచించాలని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.