Site icon Prime9

Pushpa 2: సెన్సార్ పూర్తి చేసుకున్న పుష్ప 2 – ఫైనల్‌ రన్‌టైం ఎంతంటే..!

Pushpa 2 Censor Complete

Pushpa 2 Completes Censor: మరికొద్ది రోజుల్లో పుష్ప 2 థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్‌ని శరవేగంగా జరుపుకుంటుది. నవంబర్‌ 25న ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టినట్టు రష్మిక తన పోస్ట్‌లో పేర్కొంది. మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్రమోషన్స్‌ చేస్తూ పుష్ప టీం ఫుల్‌ బిజీ బిజీగా ఉంది. సుకుమార్‌ పుష్ప 2 ఫైనల్‌ అవుట్‌పుట్‌ రెడీ చేసే క్రమంలో ప్రమోషనల్‌ ఈవెంట్స్‌కి రాలేకపోతున్నారు. ఇటీవల పుష్ప 2 ఫైనల్‌ అవుట్‌పుట్‌ రెడీ చేసి సెన్సార్‌కి పంపించారు. సెన్సార్‌ బోర్డు మూవీకి ఎలాంటి కట్స్‌ లేకుండానే యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

అంతేకాదు ఈ సినిమా చూసిన బోర్డు సభ్యులు మూవీ బ్లాక్‌బస్టర్ కొట్టడం పక్కా అని ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తోంది. ఇక మూవీ రన్‌ టైం కూడా లాక్‌ అయ్యింది. సినిమా నిడివి 3:18 గంటలు ఉన్నట్లు సమాచారం. అయితే రన్‌ టైం ఎక్కువ ఉన్న ఏం పర్వాలేదు, పుష్ప లాంటి సినిమాకు ఆ మాత్రం నిడివి ఉంటేనే కిక్‌ ఉంటుందని అంటున్నాయి సినీవర్గాలు. రన్‌టైం ఎక్కువగా ఉన్న పుష్ప 2ని ఆడియన్స్‌ ఆస్వాధిస్తారు. పార్ట్‌ 1కి మూడు గంటలు ఉంది. అయినా ఆడియన్స్‌ మొదటి నుంచి చివరి వరకు స్క్రీన్స్‌కే అతుక్కుపోయారు. నిడివి ఎంత ఉన్న మూవీ మంచి విజయం సాధిస్తుందని పార్ట్‌ నిరూపించింది.

కాబట్టి పార్ట్‌ 2 నిడివి ఎక్కువ ఉన్న ఆడియన్స్‌ దాన్ని ఆస్వాధిస్తారని సినీవర్గాల్లో చర్చ జరుగుతుంది. అలాగే సినిమా నిడివిపై నిర్మాత నవీన్‌ యర్నేనీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 మూవీ నిడివి ఎంత ఉన్న ఇబ్బంది లేదని, సినిమా చూశాకా ఆడియన్స్‌ అసలు దాని గురించే మాట్లాడరని ఆయన పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై నీవన్‌ యర్నేనీ, రవిశంకర్‌ యలమించిలి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్పకు ఇది సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. 2021లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. పాన్‌ ఇండియా స్టాయిలో రిలీజైన ఈ చిత్రం వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద దాదాపు రూ. 390కి పైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది.

రిలీజ్‌కు ముందే రికార్డులు

ఒక్క తెలుగులో రూ, 136 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమా హిందీలో రూ. 100 కోట్లు రాబట్టింది. దీంతో పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే పుష్ప 2 సాధించిన రికార్డ్స్‌ చూస్తుంటే మూవీపై మరింత హైప్‌ పెంచుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఇప్పటి వరకు 150 మిలియన్ల వ్యూస్‌ సాధించిన తొలి సౌత్‌ ఇండియా మూవీ ట్రైలర్‌గా నిలిచింది. ఓవర్సీస్‌లో 50 వేలకుపైగా టికెట్స్‌ సేల్‌ అయిన ఫాస్టెస్ట్‌ మూవీగా రికార్డు ఎక్కంది. ఇక ట్రైలర్‌ విడుదలైన 15 గంటల్లోనే అత్యంత వేగంగా 40 మిలియన్ల వ్యూస తెచ్చుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. అటూ బుక్‌మై షోలోనూ పుష్ప 2 క్రేజ్‌ మామూలుగా లేదు. ఇప్పటికే 1 మిలియన్‌ లైక్స్‌ సొంతం చేసుకుంది. పెటీఎంలోనూ 1.3 మిలియన్స్‌కి పైగా లైక్స్‌ సాధించింది.

Exit mobile version