Site icon Prime9

Ali : పవన్ కళ్యాణ్ కి నాకు కావాలనే గ్యాప్ క్రియేట్ చేశారు : అలీ

ali opens on clashes with pawan kalyan in alitho jollyga show

ali opens on clashes with pawan kalyan in alitho jollyga show

Ali : తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. చరణ్ – రానా, ప్రభాస్ – గోపీచంద్ , శర్వానంద్ – చరణ్ , ఎన్టీఆర్ – చరణ్, అఖిల్ – నితిన్, అలానే సీనియర్ హీరోల విషయానికి వస్తే జగపతిబాబు – అర్జున్ , చిరు – నాగార్జున… ఇలా చాలా మంది ఉన్నారు. అయితే వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు పవన్ కళ్యాణ్ – అలీ. వీరిద్దరి స్నేహం గురించి తెలియని వారుండరు.

పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ప్రారంభించక ముందు నుంచి ఆయనకు, అలీకి పరిచయం ఉంది. చిరంజీవి కోసం ఇంటికి వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్‌ను చూసేవాడినని అలా వారి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిందని పలు సందర్భాల్లో అలీ తెలిపారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా అలీతో ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి ఎన్నో ఇంటర్వ్యూ లలో, సినిమా ఫంక్షన్స్ లో బహిరంగంగానే వ్యక్తపరిచారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో దాదాపు నటించాడు అలీ.

తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి, బంగారం, అన్నవరం, జల్సా, పులి, కాటమ రాయుడు, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, ఇలా ఎన్నో సినిమాల్లో వీరి కాంబినేషన్ ప్రేక్షకులతో నవ్వులు పూయించింది. ముఖ్యంగా ఖుషి సినిమా అయితే ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాజకీయాలలో ప్రవేశించినప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఈ తరుణంలోనే అలీ వైకాపాకి మద్దతు ఇస్తుండడంతో ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకున్నారు. స్నేహితులు కూడా నన్ను వదులుకున్నారు, లైఫ్ ఇచ్చాను అంటూ పవన్ కళ్యాణ్ అనడం, ఆ తర్వాత తనకు ఎవ్వరూ కూడా లైఫ్ ఇవ్వలేదని, ఆయన సినిమాల్లోకి రాక ముందు నుంచే తాను పరిశ్రమలో ఉన్నానని ఆలీ అనడం మరింత గ్యాప్ కి కారణం అయ్యిందని చెప్పాలి.

దీంతో అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేక్షకులు సైతం రాజకీయల వల్లే మంచి స్నేహితులు విడిపోయారని అనుకుంటున్నారు. అయితే ఇటీవల అలీ కూతురు పెళ్లికి సైతం పవన్ రాకపోవడంతో వీరిద్దరి వైరం తీవ్ర స్థాయికి చేరిందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడిచింది. కానీ అందుకు గల కారణాన్ని అలీ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు. కాగా ఇప్పుడు తాజాగా వారి మధ్య వచ్చిన గ్యాప్ గురించి అలీ నోరు విప్పడం చర్చనీయాంశం అవుతుంది. అలీ వ్యాఖ్యాతగా చేస్తున్న ” అలీతో సరదాగా షో ” 300 + ఎపిసోడ్ అంటూ ఈ సీజన్ చివరి ఎపిసోడ్ ని కొత్తగా ప్లాన్ చేశారు. ఏ ఏమేరకు తాజాగా విడుదలైన ప్రోమోలో యాంకర్ గా సుమ కనిపించగా అతిథిగా అలీ వచ్చారు. ఈ షో ముగియబోతుందని త్వరలోనే మరో షో తో మీ ముందుకు వస్తామని ఈ సందర్భంగా అలీ తెలిపారు. ముందుగా ఈ షో తొలిరోజు మంచు లక్ష్మిని ఇంటర్వ్యూ చేసినందుకు తనకు కృతజ్ఞతలు తెలిపారు అలీ.

ఆ తర్వాత సుమ, అలీ మధ్య సరదాగా సాగిన సంభాషణలో పవన్ కళ్యాణ్ గురించి ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు సుమ. పవన్ కళ్యాణ్ కి మీకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. అందుకు అలీ స్పందిస్తూ ” మా మధ్య ఎలాంటి గ్యాప్ రాలేదు… క్రియేట్ చేశారు అంటూ చెప్పడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. అసలు అలీ ఎందుకు అలా అన్నారు ? వారి మధ్య గ్యాప్ కి కారణం ఏంటి ? వంటి విషయాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేంత వరకు ఆగక తప్పదు.

Exit mobile version