Site icon Prime9

Munugode by poll: తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయడమే భాజపా, తెరాస లక్ష్యం…రేవంత్ రెడ్డి

Aim of BJP and Trs is to eliminate the presence of Congress in Telangana

Aim of BJP and Trs is to eliminate the presence of Congress in Telangana

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయడమే తెరాస, భాజపా పార్టీల లక్ష్యమని టిపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో మాటలు తూటాల్లా పేలుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ ఉనికిలో కూడా లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 8 ఏళ్ల పాలనలో తెలంగాణకు కేసీఆర్‌ చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వేల కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. కేసీఆర్ ఓ ఆర్థిక ఉగ్రవాదని విమర్శించారు. కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేయట్లేదు? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను బలహీన పర్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

రేవంత్ ఆరోపణలకు తగ్గట్టుగానే వ్యవహారం నడుస్తుంది. తొలి నుండి భాజపా నేతలు కాళేశ్వరం ప్రాజక్టులో వేల కోట్ల అవినీతి అని పదే పదే మాట్లాడారు. అయితే ఎక్కడా అందుకు సంబంధించిన వ్యక్తులపై వ్యవస్ధల దాడులు లేవు. అదే ఆప్ నేత కేజ్రీవాల్ పై పదే పదే భాజపా నేతలు విరుచుక పడుతున్నారు. ఊ అంటే కేసు..ఆ అంటే కేసులు పెట్టేలా ఈడీ, సీబీఐ వ్యవస్ధలు ఢిల్లీలో హడావుడీ చేస్తున్నాయి. తెలంగాణ విషయానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి అన్నట్లుగా తెరాస, భాజపా పార్టీల మద్య ఏదో ఒప్పందం ఉందన్న సందేహాలు ప్రజల్లో కూడా పుట్టు కొస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Nirmala Sitharaman: తాంత్రికుడి మాటలు వినే కేసిఆర్ ఆ పని చేసింది.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

Exit mobile version