Site icon Prime9

Actor Srikanth : ఏపీ మద్యంపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ షాకింగ్ కామెంట్స్.. బూమ్ బూమ్ బీర్ తాగుతూ !

actor srikanth ayyangar shocking comments on ap alcohol

actor srikanth ayyangar shocking comments on ap alcohol

Actor Srikanth :  ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుల్లో “శ్రీకాంత్ అయ్యంగార్” కూడా ఒకరు. రామ్ గోపాల్ వర్మ శిష్యులలో ఒకరైన ఈయన.. వర్మ తెరకెక్కించిన సినిమాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ మధ్య కాలంలో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే సామజవరగమనా చిత్రంలో శ్రీ విష్ణుకు మామగా నటించి మెప్పించిన శ్రీకాంత్.. బెదురులంక 2012 చిత్రంలో దొంగస్వామిగా నటించి.. మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు హిట్ అందుకోవడంత శ్రీకాంత్ మరింత ఫేమస్ అయ్యాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. తన సినిమాకు సంబంధించిన విషయాలను.. అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

ఈ తరుణంలోనే తాజాగా ఏపీలో దొరికే మద్యం గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు సోషల్ మీడియా వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ చేతితో సిగరెట్, మరో చేతిలో బూమ్ బూమ్ బీర్ బాటిల్ ను చూపిస్తూ యాక్టర్ శ్రీకాంత్ సెటైర్లు వేసారు. మద్యపానం, దూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ.. ”నేను బెజవాడలో వున్నారు. కొద్దిగా డిప్రెషన్ గా వుంటే బీరు తెచ్చుకున్నాను. నేను తెచ్చుకున్నది మామూలు బీర్ కాదు (బూమ్ బూమ్ బీర్ బాటిల్ చూపిస్తూ). ఇంట్లోవాళ్లకు, మిత్రులు ఎవ్వరికీ చెప్పలేదు… మీకే చెబుతున్నా. ఇది తాగుతున్నాను కానీ ఏమవుతుందో తెలీదు. ఏమయినా నన్ను మరిచిపోకుండా గుర్తుపెట్టుకొండి” అంటూ శ్రీకాంత్ ఏపీ మద్యంపై సెటైర్లు వేసారు. అయితే ఇవి సరదా గానే చెప్తున్నట్టు అనిపిస్తున్నప్పటికి వైరల్ గా మారాయి.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రమాదకరమైన మద్యం బ్రాండ్స్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణానికి కూడా ఏపీ మద్యమే కారణమంటూ ప్రచారం జరిగింది. ఓ కార్యక్రమం కోసం కొద్దిరోజులు ఏపీలో వుండివచ్చిన తర్వాత రాకేష్ మాస్టర్ సడన్ గా చనిపోయారు. దీంతో రోజూ మద్యం తాగే అలవాటున్న ఆయన ఏపీలో లభించే మందు తాగారని… దీంతో ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయాడంటూ ప్రచారం జరిగింది. ఒక వైపు ఆయన గురువు వర్మ వైకాపాకి మద్దతుగా ఉంటుంటే.. శిష్యుడు ఇలా సెటైర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version