Site icon Prime9

67th Filmfare: ఫిలింఫేర్లో మెరిసిన “పుష్ప”.. “అల్లు” చిత్రాలకు అత్యధిక అవార్డులు

67th film fare awards

67th film fare awards

67th Filmfare: దక్షిణాది సినిమాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ మంచి ఖ్యాతిని గడిస్తున్నాయి. కాగా ప్ర‌తీ ఏడాది దేశంలోనే ప్రముఖ సినీ అవార్డుల ఉత్సవం అయిన ఫిలిం ఫేర్ అవార్డుల వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. బెంగుళూరు వేదికగా ఆదివారం రాత్రి జరిగిన 67వ ఫిలిం ఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కాగా సినీ అవార్డుల కార్య‌క్ర‌మాల్లో ఫిలింఫేర్ పుర‌స్కారాలు చాలా ప్ర‌త్యేక‌మైనవి. ఈవెంట్‌లో 2020,2021 సంవ‌త్స‌రాల‌కుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్ర‌క‌టించారు. కాగా సుకుమార్‌-అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప‌ ది రైజ్ చిత్రానికి అత్య‌ధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ అల వైకుంఠ‌పురంలో చిత్రం మూడు విభాగాల్లో పుర‌స్కారాలకు సొంతం చేసుకుంది.

ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టిన మహిళ..!

Exit mobile version