Site icon Prime9

Twitter: మస్క్ కు షాక్ ఇచ్చి ఉద్యోగులు.. 1200 మంది రాజీనామా..!

1200-employees-resigns-to-twitter

1200-employees-resigns-to-twitter

Twitter: ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మస్క్ ట్విట్టర్ కు బాస్ అయిన వెంటనే సంస్థలోని సగానికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే. వీరిలో సీఈవో పరాగ్ అగర్వాల్ సహా ఎందరో ఉన్నతస్థాయి ఉద్యోగులు కూడా ఉన్నారు. దీనితో, ట్విట్టర్ ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియక ట్విట్టర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఉద్యోగులంతా కష్టించి పనిచెయ్యాలని రోజుకు 12 గంటల చొప్పున వారానికి 80 గంటలు పని చేయాలంటూ మస్క్ స్పష్టం ప్రకటించారు. దానితో ట్విట్టర్ ఉద్యోగుల్లో మరింత అసహనం నెలకొంది. దీనితో మస్క్ చర్యను వ్యతిరేకిస్తూ ఏకంగా 1,200 మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు. వీరిలో ఎక్కువ మంది టెక్ విభాగానికి చెందిన వారేనని సమాచారం. దీనిపై వెంటనే స్పందించిన మస్క్ దిద్దుబాటు చర్యలకు దిగారు. రాజీనామా చేసిన ఉద్యోగులకు అత్యవసర ఈమెయిల్స్ పంపారు. వెంటనే శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో వారంతా రిపోర్ట్ చేయాలని మస్క్ కోరారు.

ఇదీ చదవండి: ట్విట్టర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన “ట్రంప్”

Exit mobile version
Skip to toolbar