Site icon Prime9

Panipuri Day: గూగుల్లోకి చొరబడిన గోల్ గప్పా.. పానీపూరీ డే అంటే ఏంటి..?

panipuri day

panipuri day

Panipuri Day: పానీపూరి ఈ పేరు తెలియని వారుండరు. ఈ దేశీయ స్నాక్‌కు అనేక రకాల పేర్లున్నాయి. ఓ దగ్గర పానీపూరీ అని మరో దగ్గర పుచ్కా అని ఇంకో దగ్గర గోల్ గప్పా అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. ప్రస్తుత వర్షాకాలంలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదనుకోండి. మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ పానీపూరిని గూగుల్ మాత్రం ఎందుకు గుర్తించదు చెప్పండి. అందుకే పానీపూరి ఏకంగా గూగుల్ లోకి చొరబడింది.

ఈ రోజు ఎలా వచ్చిందంటే(Panipuri Day)

దక్షిణాసియాలోని పానీపూరీలో చాలా రకాలున్నాయని ఈ స్ట్రీట్ ఫుడ్ ప్రాముఖ్యాన్ని తెలియజేసింది డూడుల్. అందుకే గూగుల్ జూలై 12న పానీపూరీ డేని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా గూగుల్ పానీపూరి ఇంటరాక్టివ్ గేమ్ ని పరిచయం చేసింది. ఎందుకంటే 2015లో జూలై 12న మధ్యప్రదేశ్ లోని ఇండోరి జైకా అనే రెస్టారెంట్ తన కస్టమర్లకు 51రకాల ప్రత్యేకమైన పానీ పూరీలను తయారుచేసి అందించింది. ఈ పానీపూరీలకు స్థానిక ప్రజలు ఫిదా అయ్యి క్యూ కట్టడంతో అది ఓ రికార్డ్ అయ్యిందని గుర్తుచేస్తూ గూగుల్ ఈ రోజును పానీపూరి డేగా సెలబ్రేట్ చేస్తుందన్నమాట.

దేశంలోనే చిన్న నుంచి పెద్ద వరకు అత్యంత ఎక్కువ మంది ఎంతో ఇష్టంగా తినే ఈ చిరుతిండి గురించి చాలా మందికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఎన్బీటీ ప్రకారం దీని మార్కెట్ విలువ సుమారు రూ.6కోట్ల పైమాటేనంట. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక గంటలో 4వేల పానీపూరీలు తయారు చేయవచ్చు. వీటితో కనీసం రూ.800 నుంచి రూ. 900 వరకు ఈజీగా సంపాదించవచ్చని చెప్తున్నారు. వ్యాపారులు కనీసం 8 గంటలు పానీపూరీ బిజినెస్ చేస్తే రోజుకు రూ.6 నుంచి 7వేల వరకు సంపాదించవచ్చని గణాంకాలు చెప్తున్నాయి.

Exit mobile version