Site icon Prime9

Rishi Sunak: రుషి సునాక్ ను వరించిన బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి

Rushi Sunak is the Prime Minister of Britain

Rushi Sunak is the Prime Minister of Britain

London: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో వేడెక్కిన బ్రిటన్ రాజకీయాలకు ఎట్టకేలకు తెరపడింది. కన్జర్వేటివ్ పార్టీ నేత, బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైనారు. సునాక్ భారత దేశ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో బ్రిటన్ లోని భారత పౌరులు సంబరాల్లో మునిగిపోయారు.

బ్రిటన్ లో నెలకొన్న ఆర్ధిక మాంధ్యానికి కారణం ప్రధాని లిజ్ ట్రస్ గా నిలవడంతో ప్రధాని పీఠం అధిరోహించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని రేసులో రుషి సునాక్ తో పాటు బోరిస్, పెన్నీ మోర్డాన్ ముగ్గురూ పోటీ బరిలో నిలబడ్డారు. అయితే అనూహ్యంగా పార్టీలో తనకు ఎంపీల సంఖ్యాబలం లేదన్న కారణంతో బోరిస్, పెన్నీలు ఇరువులు పోటీ నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రుషి సునాక్ ఏకగ్రీవంగా బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైనారు. అంతేకాకుండా 42 ఏళ్లలో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడుగా రుషి సునాక్ రికార్డు సృష్టించారు.

ఇప్పటికే తాను ప్రధానిగా ఎన్నికైతే దేశ ఆర్ధిక సంక్షోభాన్ని గట్టెక్కిస్తానని రుషి సునాక్ ప్రకటించివున్నారు.

ఇది కూడా చదవండి: Rishi Sunak: బ్రిటిష్ ప్రధాన మంత్రి ఎన్నికల బరిలోకి రుషి సునాక్

Exit mobile version