China: తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. చైనా పోలీసుల సమాచారం మేరకు. 47 మందితో ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి గుయిజౌ ప్రావిన్స్ లోని క్వియానన్ ప్రిఫెక్చర్ వద్ద జాతీయ రహదారిపై పల్టీలు కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.
పేదలు, మారుమూల, పర్వత ప్రాంతం, అనేక జాతుల మైనారిటీలకు నిలయంగా క్వియానన్ ప్రాంతం అని చెబుతుంటారు. ప్రావిన్సులో గత జూన్‌లో ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మార్చిలో జెట్ విమానం కుప్పకూలిన ఘటనలో 132 మంది చనిపోయారు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదం 27మంది మరణించడం ఈ ఏడాది జరిగిన అతిపెద్ద ప్రమాదంగా అధికారులు తెలిపారు. చైనాలో భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడంతో తరచూ ప్రజలు ప్రమాదాల భారిన పడుతున్నట్లు అక్కడి సోషల్ మీడియా కధనాలతో తెలుస్తుంది.