Site icon Prime9

Rishi Sunak: కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్న యూకే ప్రధాని రిషి సునక్ కూతురు

rishi-sunak-daughter-performs-kuchipudi-at-uk-event

rishi-sunak-daughter-performs-kuchipudi-at-uk-event

Rishi Sunak: భారతీయులు ఎక్కడున్నా తమ మూలాలను మరిచిపోరు అంటుంటారు. దానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నారు యూకే ప్రధాని రిషీ సునాక్. ఎందుకంటే తన కుమార్తెకు భారతీయ సాంస్కృతీ సంప్రదాయాలకు చెందిన నృత్య రూపాల్లో ఒకటైన కూచిపూడిని రిషీ సునాక్ నేర్పించారు. అనౌష్క సునాక్ అంతర్జాతీయ వేదికపై కూచిపూడిని ప్రదర్శించి అశేష ప్రజానికాన్ని ఆకట్టుకున్నారు. లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ కూచిపూడి డ్యాన్స్ వేడుకల్లో అనౌష్క పాల్గొన్నారు. తొమ్మిది ఏళ్ల అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటున్నారు.

తాజాగా లండన్ లో జరిగిన నృత్య వేడుకల్లో దాదాపు 100 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. వారిలో ఒకరిగా అనౌష్క కూడా పోటీ పడ్డారు. నాలుగేళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా అంతర్జాతీయ వేదికపై ఓ ప్రధాని కూతురు మన భారతీయ నృత్యకళారూపాన్ని ప్రదర్శించడం పట్ల పలువురు ప్రముఖులతో సహా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యూకే ప్రధాని పదవిని అధిరోహించిన తొలి భారత సంతతి చెందిన వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కృష్ణ సునాక్, అనౌష్క సునాక్.

ఇదీ చదవండి: మూడు రంగుల్లో ట్విటర్ “బ్లూ టిక్ “

Exit mobile version
Skip to toolbar