Site icon Prime9

Israel – Hamas War: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు .. 68 మంది మృతి

Israeli Airstrikes

Israeli Airstrikes

Israel – Hamas War: ఇజ్రాయెల్ దళాల నేతృత్వంలోని సెంట్రల్ గాజాలో ఆదివారం జరిగిన వైమానిక దాడులకలో కనీసం 68 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది మహిళలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు.ఉత్తర గాజాలోని హమాస్ యొక్క భూగర్భ సొరంగం నెట్‌వర్క్ నుండి బందిఖానాలో చంపబడిన ఐదుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) పేర్కొంది.

మాకు వేరే మార్గం లేదు..(Israel – Hamas War)

ఐడిఎఫ్ దళాలుఅక్టోబర్ 7 దాడుల సమయంలో అపహరించిన 5 బందీల మృతదేహాలను గుర్తించి, వాటిని తిరిగి ఇజ్రాయెల్‌కు తీసుకువచ్చాయని ఐడిఎఫ్ సామాజిక మాధ్యమం X లో పోస్ట్ చేసింది పొరుగున ఉన్న ఈజిప్టులో, ఇజ్రాయెల్ చేతిలో ఉన్న పాలస్తీనియన్ల కోసం మరొక బందీల మార్పిడి కోసం తాత్కాలిక ప్రయత్నాలు కొనసాగాయి.యుద్ధం గాజాలోని కొన్ని భాగాలను ధ్వంసం చేసింది. సుమారుగా 20,400 మంది పాలస్తీనియన్లు మృతిచెందగా మొత్తం భూభాగంలోని 2.3 మిలియన్ల మంది స్థానభ్రంశం చెందారు. యుద్ధానికి మేము భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. అయితు పోరాటం కొనసాగించడం తప్ప మాకు వేరే మార్గం లేదు అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.జాతీయ టెలివిజన్ ప్రసంగంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ దేశం ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version