Site icon Prime9

Imran Khan: అందుకే మాజీ ప్రధానిని చంపాలనుకున్నా.. నిందితుడి వీడియో వైరల్

i-wanted-to-kill-imran-khan-confesses-shooter-in-video

i-wanted-to-kill-imran-khan-confesses-shooter-in-video

Imran Khan: పాకిస్థాన్ లో స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ గురువారం నాడు ఒక ర్యాలీ నిర్వహిస్తుండగా అతనిపై ఓ దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆ కాల్పులకు పాల్పడిన వ్యక్తి  వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇమ్రాన్ ఖాన్‭పై కాల్పులు జరిపిన దుండగుడు.. అందుకు గల కారణాన్ని ట్విట్టర్ వేదికగా బయటపెట్టాడు. దేశ ప్రజలను ఇమ్రాన్ తప్పుదోవ పట్టిస్తున్నారనే అతన్ని చంపాలని చూశాననంటూ ఆయన నిందింతుడు వెల్లడించాడు. అయితే తాను కేవలం ఇమ్రాన్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపానని, కానీ అనుకోకుండా ఈ కాల్పుల్లో ఇతరులు కూడా గాయపడినందుకు తాను చింతిస్తున్నానని తెలిపాడు.

నిందితుడి వీడియోను పాకిస్తాన్‭కు చెందిన హసద్ అయూబ్ ఖాన్ అనే ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్‭లో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌పై ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయనతోపాటు మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. వారిని అధికారులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్, వజీరాబాద్‌లోని జఫరలీ ఖాన్ చౌక్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు.. పలువురికి గాయాలు

Exit mobile version