Site icon Prime9

క్రికెట్: అమెరికా క్రికెట్ జట్టులో తెలుగు అమ్మాయిల ఆధిపత్యం

America

America

Women U-19 USA Team: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యే అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రాతినిధ్యం వహించే 15 మంది ఆటగాళ్ల జట్టును ప్రకటించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, US అండర్-19 జట్టులో తెలుగు మూలాలున్న అమ్మాయిలు ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు, కెప్టెన్ గీతిక కోడలి తో సహా 15 మంది కూడా భారత మూలాలున్న అమ్మాయిలే ఈ మెగా టోర్నీలో ఆడనున్నారు. ఈ జట్టుకు వెస్టిండీస్ దిగ్గజం శివనారాయణ్ చంద్రపాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

అమెరికా 2010లో మొదటి సారి పురుషుల అండర్-19 ప్రపంచకప్‌లో ఆడగా.. తాజాగా మహిళల ప్రపంచకప్ కోసం పోటీ పడనుంది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ టోర్నీ జనవరి 7 నుంచి 29 వరకు జరగనుంది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్న గ్రూప్-ఏలో అమెరికా తలపడనుంది. మొదటి మ్యాచ్ శ్రీలంకతో జనవరి 14న జరగనుంది. రెండో మ్యాచ్ ఆస్ట్రేలియాతో జనవరి 16న, మూడో మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జనవరి 18న అమెరికా జట్టు తలపడనుంది. మరోపక్క భారత మహిళల జట్టు గ్రూప్-డిలో ఆడబోతుంది.

ఇదీ చదవండి: ఫిఫా ప్రపంచకప్: లియోనల్ మెస్సీకి గాయం.. ఫిఫా ఫైనల్ కు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ దూరం కానున్నాడా..?

Exit mobile version