Site icon Prime9

Corona outbreak in China: చైనాలో కరోనా విజృంభణ…ఒక్క రోజే 10 వేల కేసులు నమోదు

Corona boom in China... 10 thousand cases registered in one day

China: కరోనా మహమ్మరిని ప్రపంచానికి వ్యాప్తి చేసిన చైనాలో తిరిగి కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా చైనా వ్యాప్తంగా ఒక్క రోజులోనే 10,729 కొత్త కేసులు నమోదైన్నట్లు చైనా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో 1209మందికి లక్షణాలు కనపడుతున్నాయని అధికారులు తెలిపారు.

పాజిటివ్‌ వచ్చిన వారిలో అధికుల్లో లక్షణాలు కనపడక పోవడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ కట్టడికి అధికారులు కఠిన ఆంక్షలు విధించి జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘ్వాంగ్‌జౌవ్‌, ఛాంగ్‌క్వింగ్‌ నగరాల్లోని దాదాపు 50 లక్షల మంది కఠినా లాక్‌డౌన్‌ ఆంక్షల మధ్య నివసిస్తున్నారు. రాజధాని బీజింగ్‌లో ఒక్కరోజే 118 కొత్త కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడున్న రెండు కోట్లకుపైగా ప్రజలకి రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

ఎన్ని ఆంక్షలు అమలు చేస్తున్నా కొవిడ్‌ అదుపులోకి రాకపోవడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. రాజధాని బీజింగ్‌లోని పార్కులను మూసివేశారు. దేశవ్యాప్తంగా మరోసారి కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. పాఠశాలల విద్యార్దులను ఆన్‌లైన్‌ తరగతులకు పరిమితం చేస్తున్నారు. పలు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. రెస్టారెంట్స్‌, దుకాణాలను మూతబడ్డాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి: Fire in Maldives: మాల్దీవుల్లో అగ్నిప్రమాదం.. 9 మంది భారతీయుల మృతి

Exit mobile version