British MPs: బ్రిటీష్ ఎంపీలు గణితం మరియు ఆంగ్ల పరీక్షలను పూర్తి చేయడంలో 10 ఏళ్ల పిల్లలతో పోలిస్తే సగటున తక్కువ స్కోర్లు సాధించారు. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 11 ఏళ్ల పిల్లలచే నిర్వహించబడిన ఈ పరీక్షకు కామన్స్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ కమిటీ చైర్ రాబిన్ వాకర్‌తో సహా ఎంపీలు హాజరయ్యారు.ఈ ఈవెంట్‌ను మోర్ దేన్ ఎ స్కోర్ నిర్వహించింది, ఇది అనవసరమైన పరీక్షలను రద్దు చేయడాన్ని ప్రచారం చేసే సంస్ద.
గణితంలో కేవలం 44 శాతం మంది చట్టసభల సభ్యులు మాత్రమే ఆశించిన ప్రమాణాన్ని సాధించారని, స్పెల్లింగ్, విరామచిహ్నాలు మరియు వ్యాకరణంలో కేవలం 50 శాతం మంది మాత్రమే ఆశించిన ప్రమాణాన్ని సాధించారని నివేదిక పేర్కొంది.యూకే అంతటా, 10 మరియు 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 59 శాతం మంది ఈ సంవత్సరం గణితం, చదవడం మరియు రాయడం యొక్క SAT పరీక్షలలో ఆశించిన ప్రమాణాన్ని చేరుకున్నారు. అయితే ఎంపీలు 10 ఏళ్ల పిల్లల కంటే చాలా అధ్వాన్నంగా ఉన్నారని తెలుస్తోంది.
పరీక్షలను పూర్తిగా రద్దు చేయమనే ప్రచారం ఒప్పుకొకపోయినా ఎంపీల తాజా పరీక్ష పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని వారు గుర్తించేలా చేసింది. రాబిన్ వాకర్ 10 నుండి 11 సంవత్సరాల పిల్లలకు పరీక్షలను సంస్కరించవలసిన అవసరాన్ని గుర్తించాడు.ఇది చాలా కష్టతరమైన పరీక్ష, భవిష్యత్తులో ఏది ఉపయోగపడుతుందో మనం గుర్తించాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా మేము యువతకు విద్యను అందించడం లేదు. వారికి నేర్చుకోవాలనే ప్రేమను అందించాలి” అని ఆయన అన్నారు.