Site icon Prime9

China: లాక్‌డౌన్‌ వ్యతిరేకంగా చైనా ప్రజల ఆందోళన

anti-covid lockdown-protests-flare-up-in-xinjiang china

anti-covid lockdown-protests-flare-up-in-xinjiang china

China: చైనాలో కరోనాకేసులు మరోసారి విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కొవిడ్ లాక్‌డౌన్‌ విధించింది ఆ దేశ ప్రభుత్వం. కాగా ఆ లాక్ డౌన్ కు వ్యతిరేకంగా చైనా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

వాయవ్య చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
కాగా ఇది ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. లాక్‌డౌన్ వల్లే వారి ప్రాణాలు పోయాయని, దానిని తక్షణం ఎత్తివేయాలంటూ ఉరుమ్కి నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ ప్రజలు పూలు, కొవ్వొత్తులతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రే ఉపయోగించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందని, దానివల్ల అగ్నిప్రమాదంలో చిక్కుకున్న బాధితులు సకాలంలో తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ చదవండి: గూగుల్లో ఈ ఏడాది ఎక్కువ మంది వెతికింది ఈమెనే..!

Exit mobile version