Site icon Prime9

Germany: దోమకాటుకు కోమాలోకి వెళ్లిన వ్యక్తి

a-man-fell-into-a-coma-after-being-bitten-by-a-mosquito

a-man-fell-into-a-coma-after-being-bitten-by-a-mosquito

Germany: ఓ చిన్నదోమ అతడి జీవితాన్నే నాశనం చేసింది. దోమకాటుతో ఓ వ్యక్తి బతికుండగానే నరకం చూశాడు. కొన్నివారాలపాటు కోమాలోనే ఉండిపోయాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది.

జర్మనీలో నివాసం ఉంటున్న 27ఏళ్ల సెబాస్టియన్ రోట్షే అనే వ్యక్తిని ఆసియా టైగర్ దోమ కుట్టుంది. మొదటిలో చిన్నదోమే కదా అనుకుని లైట్ తీసుకున్నాడు. కానీ ఆ దోమ కాటుతో సెరాటియా అనే బ్యాక్టీరియా అతడి శరీరంలో ప్రవేశించింది. దానితో శరీరంలోని వివిధ అవయవాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకింది. 2021లో దోమ కుట్టిన కొద్ది రోజులకే అతడు నెమ్మదినెమ్మదిగా అనారోగ్యం పాలవుతూ వచ్చాడు. మొదట అతడికి ఫ్లూలాంటి లక్షణాలు కనిపించాయి. అనంతరం తొడభాగం మొత్తం పాడైపోయింది. దానితో సెబాస్టియన్ మంచానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. దాని తర్వాత కొన్ని వారాలపాటు కోమాలోనే ఉన్నాడు. కాగా తాజాగా వైద్యులు అతనికి 30 శస్త్రచికిత్సలు చేశారు. తన రెండు కాలివేళ్లకు ఇన్ఫెక్షన్‌ సోకగా, పాక్షికంగా తొలగించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌ వ్యతిరేకంగా చైనా ప్రజల ఆందోళన

Exit mobile version