Health Tips : నోటి పూతలను తగ్గించే చిట్కాలు
మనలో చాలా మంది విటిమిన్ బి 12 లోపించి , ఒంట్లో వేడి ఎక్కువయ్యి నోటి పూతలు వస్తాయి . దీని వల్ల సరిగా తినలేరు, సరిగా పడుకోలేరు, చివరికి మంచి నీళ్లు తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది . అవి భరించ లేని బాధను కలిగిస్తాయి. వాటిని తగ్గించడానికి కొంత మంది ఐతే నానా రకాల చిట్కాలన తో ప్రయత్నిస్తారు . కానీ లాభం ఉండదు పూతలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి . అప్పుడు ఏమి తిందామనుకున్న నొప్పి, మంటను భరించ లేని బాధను కలిగిస్తాయి. మనము ఆ సమయంలో వేడిని తగ్గించేవి మాత్రమే తీసుకోవాలి. అప్పుడు కొంచం నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది .
నోటి పూతను తగ్గించే చిట్కాలను చదివి తెలిసుకొని పాటించండి
1. వెల్లులి
వెల్లులి మనకు అన్ని రకాలుగా ఉపయోగ పడుతుంది . దీనిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువుగా ఉంటాయి .ఇవి నొప్పిని తగ్గిస్తుంది. ఈ నోటి పుతల వచ్చినప్పుడు ఏమి తీసుకోక నీరసంగా కూడా ఐపోతారు. వీటిలో నొప్పిని తగ్గించే గుణాలు ఎక్కువుగా ఉంటాయి . వెల్లుల్లి నోటి పూతల తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఒకటి నుంచి రెండు నిమిషాలు పటు వెల్లుల్లిని నోటి పూతల దగ్గర అదుముకోవాలి . కొంత సమయం తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి .ఈ విధంగా చేస్తే మీకు నోటి పూత నుంచి ఉపశమనం కలుగుతుంది.
2. ఐస్ ముక్కలు
నోటి పూతలు వచ్చిన చోట ఐస్ ముక్కలను పెట్టిన తగ్గిపోతుంది . ఐస్ పెట్టిన తరువాత కొంచెం తిమ్మిరిగా ఉంటుంది. కొంత సమయం తరువాత నొప్పి తగ్గిస్తుంది . మంట ముంచి కూడా కొంచెం ఉపశమనం లభిస్తుంది. కొన్ని ఐస్ ముక్కలను ఒక టవల్‌లో పెట్టుకొని నోటి పూతల దగ్గర మంట తగ్గి , చల్లగా ఉంటుంది.