Site icon Prime9

Health Benefits Of Sesame Seeds: “నువ్వులు”తో నిండు నూరేళ్లు బతకొచ్చు..!

Health Benefits Of Sesame Seeds

Health Benefits Of Sesame Seeds

Health Benefits Of Sesame Seeds: నువ్వులపై కొంత మంది ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి ఆ రోజుల్లో తింటే మంచిది కాదు.. ఈ రోజుల్లో తినకూడదు అంటూ ఉంటారు. కానీ నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందునే పండగలకు చేసుకునే పిండి వంటల్లో వాటికి ప్రముఖ స్థానం కల్పించారు పూర్వీకులు. ముఖ్యంగా చలికాలంలో అయితే వీటి అవసరం ఎక్కువగా ఉన్నందని చెప్తూ పలు ప్రాంతాల్లో విభిన్నమైన పిండి వంటలు చేస్తారు. నువ్వులలో ఉండే ఫైబర్ కంటెంట్, విటమిన్లు అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.

కొలెస్ట్రాల్ కు నువ్వులతో చెక్
అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నట్టయితే రోజూ కొన్ని నువ్వులు మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సగం అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు.

గుండె జబ్బుల నుంచి నువ్వులు కాపాడుతాయి
నువ్వుల్లో మన శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు పాలి‌అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు, మోనో‌అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి.
అంతేకాకుండా వీటిలో లిగ్నన్స్, పైటోస్టెరాయిస్ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిచండంలో ఇవి సహాయపడతాయి.

బ్లడ్ ప్రెజర్‌కు నువ్వులు దివ్యమైన ఔషధం
బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటే గుండెజబ్బులు, ఇతర స్ట్రోక్‌లు ఎదురయ్యే ముప్పు అధికంగా ఉంటుంది. అయితే నువ్వుల్లో ఉండే అధిక మెగ్నీషియం నిల్వలు ఈ బ్లడ్ ప్రెజర్ స్తాయిని తగ్గిస్తుంది.

ఎముకల బలహీనతలను నివారించే నువ్వులు
మీ ఎముకలు బలంగా ఉండాలంటే నువ్వులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. బోన్ హెల్త్‌ కోసం పనిచేసే కాల్షియం సహా అనేక పోషకాలు ఈ నువ్వుల్లో ఉంటాయి. బాగా పాలిష్ అయిన నువ్వుల్లో కాల్షియం స్థాయి తగ్గుతుంది. కానీ పైపొర పోకుండా ఉన్న నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ పుష్కలంగా ఉంటాయి. నువ్వులను నానబెట్టుకుని లేదా రోస్ట్ చేసుకుని, లేదా మొలకలు చేసుకుని తింటే మన శరీరం వీటి నుంచి అన్ని ప్రయోనాలు పొందుతుంది.

మోకాలి నొప్పులకు నువ్వులతో మేలు
ఆస్టియో ఆర్థరైటిస్ సర్వసాధారణంగా వచ్చే జాయింట్ పెయిన్. ఇవి తరచుగా మోకాలు నొప్పులకు గురిచేస్తుంది. ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ వల్ల మృదులాస్థి కీళ్లు దెబ్బతింటాయి. అయితే నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షలు, యాంటీఆక్సిడంట్ ప్రభావాలు కలిగి కార్టిలేజ్‌ను రక్షిస్తాయి.

థైరాయిడ్ ఆరోగ్యానికి నువ్వులు
నువ్వుల్లో ఉండే సెలీనియం థైరాయిడ్ పేషెంట్లకు మేలు చేస్తుంది. సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో పనిచేస్తుంది.
ఐరన్, కాపర్, జింక్, విటమిన్ బీ6 వంటివి థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఇదీ చదవండి: కడుపులో మంటకు “కిస్మిస్” తో చెక్

Exit mobile version