Site icon Prime9

Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త సుమీ..!

Can green tea extract hurt your liver

Can green tea extract hurt your liver

Green Tea: నేటి కాలంలో పలు రకాల టీలు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో ఒకటి గ్రీన్ టీ. అయితే ఈ గ్రీన్ టీతో ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు ఉన్నాయని అనేక మంది ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అదే గ్రీన్ టీ కొందరిలో కాలేయ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గ్రీన్ టీని అదేపనిగా తీసుకునే వారిలో క్యాన్సర్, గుండె జబ్బులు, స్థూలకాయం, టైప్ 2 మధుమేహం రిస్క్ తగ్గుతుందని పలు అధ్యయనాలు తేల్చాయి. కానీ, తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం కొందరిలో కాలేయం దెబ్బతినడానికి కూడా గ్రీన్ టీ కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. డైటరీ సప్లిమెంట్స్ అనే జర్నల్ లో రట్గర్స్ రీసెర్చ్ ఫలితాలు ప్రచురితమయ్యాయి. గ్రీన్ టీని అధిక మోతాదులో పాటు తీసుకోవడం వల్ల ప్రయోజనాలున్నాయనే దానికి ఆధారాలు పెరుగుతున్నందున.. గ్రీన్ టీతో కాలేయం దెబ్బతినే ప్రమాదం ఎవరికి ఉంటుందో అంచనా వేయడం కాస్త కష్టమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జన్యుపరమైన వైవిధ్యాలున్నవారికి గ్రీన్ టీతో కాలేయం దెబ్బతినే రిస్క్ ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.

కాటెకాల్ ఓ మెథిల్ ట్రాన్సఫరేస్ జీనోటైప్ వారిలో గ్రీన్ టీతో కాలేయం దెబ్బతింటుందని అంటున్నారు. యూజీటీ1ఏ4 జీనోటైప్ వారు ఎనిమిది నెలల పాటు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. గ్రీన్ టీ తీసుకోవడం ఎవరికి సురక్షితం అనే విషయాన్ని నిర్ధారించడానికి మరెన్నో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఉప్పుతో ముప్పు.. అమితంగా తినొద్దు..!

 

Exit mobile version