Winter Foods: చలికాలం వచ్చిందంటే చాలు చిన్నాపెద్ద అందరూ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. మరీ ముఖ్యంగా చిన్నారులు వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. సరిగ్గా ఆహారం తీసుకోరు. మరి వారికి ఎలాంటి ఆహారాలను ఇవ్వడం వల్ల వారిలో ఇమ్యూనిటీ పెంచవచ్చో ఓ సారి చూసేద్దాం.
బెల్లం: చలికాలంలో పిల్లలకు బెల్లంతో చేసిన ఆహారాలను అందించడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా చూడవచ్చు. బెల్లంలో ప్రోటీన్, కోలిన్, బీటైన్, విటమిన్ బీ12, బీ6, ఫోలేట్, కాల్షియం, ఐరన్‌తో పాటు అనేక ఇతర ఖనిజాలను కలిగి ఉంటుంది.
కోడిగుడ్లు: చలికాలంలో చిన్నారులకు నిత్యం కోడిగుడ్డు తినిపించాలి. వివిధ రకాలుగా గుడ్డుతో వంటకాలు చేసి పెట్టడం ద్వారా హాయిగా తింటారు చిన్నారులు.
గుడ్డులో అనేక ప్రోటీన్లు, పోషకాలు పిల్లలకు అందుతాయి.
ఉసిరి: శీతాకాలంలో విరివిగా లభించే ఉసిరి రోగ నిరోధక శక్తిని పెంచడంతో కీలకపాత్ర పోషిస్తుంది. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లూ, జలుబు, జీర్ణ సమస్యలు వంటి సాధారణ వ్యాధులను
నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఖర్జూరం: ఖర్జూరం పండ్లు ఎక్కువగా తినేలా ప్రోత్సహించాలి. ఇవి హార్మోన్ నియంత్రణ, వాపు తగ్గింపు, రోగనిరోధకత పెంపుదలకు మద్దతుగా నిలుస్తాయి.
ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉండి అనేక రోగాల బారి నుంచి మనల్ని కాపాడుతుంది.
సిట్రస్ జాతి పండ్లు: సీ విటమిన్ పుష్కలంగా లభించే నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లను ఎక్కువగా తినిపించాలి. ఇవి చిన్నారుల్లో వ్యాధినిరోధక వ్యవస్థకు పెంచడానికి సహాయపడతాయి.
బీట్రూట్: వీటిలో అధిక మొత్తంలో పీచు ఉండి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే, రోగనిరోధక వ్యవస్థను బలపరిచి వ్యాధుల నివారణలో సాయపడుతుంది.
సూప్‌లు: చలి వాతావరణంలో వేడిని అందించేందుకు పిల్లలకు ఎక్కువగా సూప్‌లు ఇవ్వాలి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. సూప్‌లలో పాలకూర, బ్రోకలి, మష్రూమ్, బీన్స్, బీట్రూట్, చికెన్ ముక్కలు,
మటన్ స్టిక్స్ వంటివి కూడా చేర్చి రుచి, శక్తిని మెరుగుపర్చవచ్చు.
డ్రైఫ్రూట్స్ నట్స్: జీడిపప్పు, బాదాం, వేరుశనగ, పిస్తా, వాల్నట్ వంటివి ఎక్కువగా తినిపించాలి. నేరుగా తినకపోతే పొడిగా చేసి కూరల ద్వారా అందివ్వాలి.
ఇదీ చదవండి: శీతాకాలంలో జలుబుకు చెక్ పెట్టండిలా..!