Site icon Prime9

Pushpa-2: పుష్ప-2లో బాలీవుడ్ హీరో..!

will Arjun Kapoor in pushpa2 movie

will Arjun Kapoor in pushpa2 movie

Pushpa-2: అల్లు అర్జున్ (బన్నీ) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ మూవీ దేశవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌ అయిన పుష్ప-2 చిత్రం ప్రస్తుతం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీలో ఒక బాలీవుడ్‌ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్త వైరల్ అవుతుంది.

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ పుష్ప2లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారని, దానికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని సినీ పరిశ్రమలో సమాచారం. ఇదే నిజమైతే అర్జున్‌ కపూర్‌ తెలుగులో నటించే తొలి చిత్రం పుష్ప2నే అవుతుందని అభిమానులు అంటున్నారు. దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందిస్తే కానీ నిజానిజాలేంటో తెలియదు. గతంలోనూ ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, మనోజ్‌ బాజ్‌పాయ్‌లు నటిస్తారంటూ వార్తలు వచ్చాయి కానీ అలాంటివేవీ లేదంటూ నిర్మాణసంస్థ అప్పట్టలో వెల్లడించింది.

ఇదీ చదవండి: “మైడియర్ చిరు ఐ లవ్ యూ”.. నెట్టింట వీడియో వైరల్

Exit mobile version