Tollywood: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ – టాలీవుడ్‌కు ప్రభుత్వ ప్రతిపాదనలు

  • Written By:
  • Updated On - December 26, 2024 / 12:14 PM IST

Celebrities List Who Meets CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సంధ్య థియేటర్‌ ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి సంతరించుకుంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరేడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం టాలీవుడ్‌ కు కొన్ని ప్రతిపాదనలు చేసింది. యాంటి డ్రగ్‌ క్యాంపెయిన్‌ టాలీవుడ్ మద్దతు ఇవ్వాలి. హీరో, హీరోయిన్లు ప్రచారానికి కీలకంగా ఉండాలి. కుల గణన సర్వేపై ప్రచారానికి ముందుకు రావాలి.

ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సహకారం అందించాలి. ఇకపై సినిమా టికెట్ల ప్రత్యేక సెస్‌ విధింపు. సెస్‌ ద్వారా వచ్చే నిధులు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్లకు వినియోగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక ఈ మీటింగ్‌కు హాజరైన సినీ ప్రముఖులు, చర్చించే అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సమావేశంలో దాదాపు 30 మంది సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.

నిర్మాతల నుంచి.. దిల్‌ రాజు, దగ్గుబాటి సురేష్‌ బాబు, అల్లు అరవింద్, మొరళీ మోహన్, పుష్ప నిర్మాతలు నవీన్‌ యర్నేనీ, రవి శంకర్, నిర్మాత నాగవంశీ, ఏషియన్‌ సునీల్‌ నారంగ్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌, సుధాకర్‌ రెడ్డి, స్రవంతి రవి కిషోర్‌, కెఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ వంశీ, భొగవల్లి ప్రసాద్‌, నిర్మాత చినబాబు, సుప్రీయ యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. హీరోలు.. దగ్గుబాటి వెంకటేష్‌, అక్కినేని నాగార్జున, వరుణ్‌ తేజ్‌, నితిన్‌, శివ బలాజీ, కిరణ్‌ అబ్బవరంలు హాజరు అయ్యారు.

అలాగే దర్శకుల సంఘం నుంచి అధ్యక్షుడు వీర శంకర్‌, కె రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, విశ్వంభ డైరెక్టర్‌ వశిష్ట, హరీష్‌ శంకర్, అని రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్‌ వర్మ, సాయి రాజేష్‌లు పాల్గొన్నట్టు తెలుస్తోంది. తెలుగు ఫలిం ఛాంబర్‌ నుంచి చాంబర్‌ అధ్యక్షుడు భరత్‌ భూషణ్‌, సెక్రటరీ దామోదర్‌ ప్రసాద్‌తో పాటు మా అసోసియేషన్‌లో పాటు తెలుగు ఫిలీం చాంబర్‌, ఫిలిం ఫెడరేషన్‌ నుంచి పలువురు ప్రతినిధులు హాజరుకానున్నారు. అలాగే ఈ సమావేశంలో డీజీపీ జితేందర్‌, చిక్కడపల్లి ఏపీసీ, డీసీపీలతో పాటు హోంశాఖ సెక్రటరీ రవిగుప్తాలు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.