Site icon Prime9

Venkatesh: దిల్‌ రాజు ఇంట్లో ఐటీ దాడులు – స్పందించిన వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి

Venkatesh Reacts on IT Raids: టాలీవుడ్‌ సినీ ప్రముఖుల ఇళ్లలో, కార్యాలయాల్లో ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. గత మూడు రోజులుగా ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్‌ ఛేంజర్‌ వంటి భారీ సినిమాలు రిలీజ్‌ మంచి వసూళ్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా మూవీ నిర్మాతలు దిల్‌ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్‌ సుకుమార్‌ ఇంట్లో ఐటీ సోదాలు చేపడుతుంది. మూడు రోజులుగా ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్‌ ఇండస్ట్రీ ప్రముఖు ఇళ్లల్లో జరుగుతున్న ఐటీ దాడులపై హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి స్పందించారు.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సందర్భంగా తాజాగా హీరో వెంకటేష్‌, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మీడియాతో ముచ్చటించారు. ఈ రోజు జరిగిన ప్రెస్‌మీట్‌లో వారికి ఐటీ దాడులపై ప్రశ్న ఎదురైంది. హీరోలు కనుక రెమ్యునరేషన్‌లో వైట్‌లో తీసుకుంటే ఏ నిర్మాతకు కూడా బ్లాక్‌ చేయాల్సిన అవసరం లేదు అని ఓ పెద్ద నిర్మాతలు అన్నారు. హీరోలు కనుక బ్లాక్‌లో రెమ్యునరేషన్‌ తీసుకోకుండ మాకు బ్లాక్‌లో ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. దీనిపై మీరేమంటారని ప్రశ్నించారు. దీనికి వెంకటేష్‌ స్పందిస్తూ.. అందరి గురించి నాకు తెలియదు. కానీ, నేను మాత్రం ఫుల్‌ వైట్‌ తీసుకుంటా. వైట్‌లో వైట్‌. తీసుకునేది ఇంతే. ఎక్కువ తీసుకోను. తీసుకునేది కూడా వైట్‌లోనే. అది కూడా ఆపీసులోనే డైరెక్ట్‌ తీసుకుంటాను” అని అన్నారు.

దీనిపై అనిల్‌ రావిపూడి స్పందిస్తూ.. “ఇండస్ట్రీలో ఇవన్ని సాధారణమే. ఈ దాడుల వల్ల దిల్‌ రాజు గారు ఏం బాధలో లేరు. ఇదంతా ప్రాసెస్‌లో భాగం మాత్రమే. రెండు మూడేళ్లకు ఒకసారి ఇండస్ట్రీలోని ప్రముఖుల ఇళ్లలో దాడులు జరగడమ సర్వసాధారణమే. ‘తాను వచ్చిన రాకపోయిన సినిమా ప్రమోషన్స్‌ని ఆపోద్దు’ అని దిల్‌ రాజు గారు చెప్పారు. అందుకే మేము ఈ ప్రమోషన్స్‌ని కొనసాగిస్తున్నాం. మా సినిమాకు వచ్చిన నెంబర్లన్ని జీఎస్టీతో కలిసి వేసినవి. ఈ సినిమాకు వచ్చిన ప్రతి పైసా ఆడియన్స్ నవ్వుల నుంచి వచ్చినవే. కలెక్షన్స్‌ని మేము వెల్లడించాల్సి అవసరం లేదు. కానీ ఈ జానర్‌ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.. ఇలాంటి జానర్‌తో హిట్‌ కొట్టొచ్చని మరికొందరు తెలుసుకుని సినిమాలు తీస్తారనే ఉద్దేశంతో కలెక్షన్స్‌ ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నాం” అన్నారు.

Exit mobile version