Site icon Prime9

Varasudu: టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్.. సంక్రాంతి బరిలో “వారసుడు” నిలిచేనా..?

tollywood-vs-kollywood-in-varasudu-movie-issue

tollywood-vs-kollywood-in-varasudu-movie-issue

Varasudu: తమిళ స్టార్ హీరో ధళపతి విజయ్ ‘వారసుడు’ సినిమా టాలీవుడ్, కోలీవుడ్ మధ్య చిచ్చు రేపుతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీని తమిళంలో ‘వారిసు’గా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు చిత్ర బృందం. అయితే సంక్రాంతికి తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలని డబ్బింగ్ సినిమాలను విడుదల చేయవద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖ విడుదల చేసింది. ఈ లేఖపై తమిళ సినీ దర్శకనిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడులో తెలుగు సినిమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల అవుతున్నాయని.. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తమిళ చిత్రాలను ఆపడం ఏమిటని వారు ప్రశ్నించారు.
ఇలాగైతే తాము కూడా తెలుగు సినిమాలను అడ్డుకుంటామన్నారు. వారసుడు సినిమా దర్శకుడు, నిర్మాత ఇద్దరూ తెలుగువారేనని, హీరో మాత్రమే తమిళ నటుడని తమిళ దర్శకుడు సీమాన్ అన్నారు. ఇంత జరుగుతున్నా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరి ఈ వివాదానికి ఎలా చెక్ పెడుతారు. ఇంతకీ సంక్రాంతి బరిలో వారసుడు నిలుస్తాడాలేదా అని వేచి చూడాలి.

ఇదీ చదవండి: నాని ‘మీట్ క్యూట్’ సిరీస్​ ట్రైలర్​ రిలీజ్​.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు అంటే..?

 

Exit mobile version