Site icon Prime9

Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌లు ఏవంటే..?

upcoming releases of movies and web series in september details

upcoming releases of movies and web series in september details

Upcoming Releases : సెప్టెంబర్ నెలలో సినిమా లవర్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ దొరుకుతుందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద జవాన్ సినిమా రికార్డులు తిరగరాస్తుంటే.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం కూడా వినాయకచవితిని పురస్కరించుకొని పలు సినిమాలో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయితే ఇక్కడ చిన్న సినిమాలే ఎక్కువగా ఉండగా.. విశాల్ నటించిన మార్క్ ఆంటోని మాత్రం పెద్ద సినిమాగా అనిపిస్తుంది. మరి ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రాలతో పాటు, ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు, సిరీస్ లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాల వివరాలు..

మార్క్‌ ఆంటోని.. 

విశాల్‌ కథానాయకుడిగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మార్క్‌ ఆంటోని”. ఎస్‌జే సూర్య, అభినయ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  మినీ స్టూడియోస్‌తో కలిసి ఎస్‌.వినోద్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ మూవీ టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్ తో రాబోతుంది.   అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 15న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఈ మూవీ పట్ల అంచనాలు పెంచేలా చేసింది.

ఛాంగురే బంగారు రాజా.. 

సతీశ్‌ వర్మ దర్శకత్వంలో కార్తీక్‌ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన సినిమా “ఛాంగురే బంగారు రాజా”. మాస్ మహరాజ్ రవితేజ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. సలార్ పోస్ట్ పోన్ అయిన క్రమంలో ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

రామన్న యూత్‌..

పెళ్లి చూపులు, జార్జి రెడ్డి ఫేమ్  నవీన్‌ బేతిగంటి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం “రామన్న యూత్‌”. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సోదర సోదరీ మణులారా..

ప్రముఖ నటుడు కమల్‌ కామరాజు, అపర్ణాదేవి కీలక పాత్రల్లో నటించిన చిత్రం “సోదర సోదరీ మణులారా”. రఘుపతి రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందినట్లు తెలుస్తుంది. వినాయకచవితిని పురస్కరించుకుని సెప్టెంబరు 15న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌ల వివరాలు (Upcoming Releases)..

నెట్‌ఫ్లిక్స్‌..

వైఫ్‌లైక్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 11

రెజ్లర్స్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 13

రామబాణం (తెలుగు) సెప్టెంబరు 14

ఎ మిలియన్‌ మైల్స్‌ ఎవే (హాలీవుడ్) సెప్టెంబరు 15

మిసెడ్యుకేషన్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 15

శ్రీ (హిందీ) సెప్టెంబరు 15

భోళా శంకర్‌ (తెలుగు) సెప్టెంబరు 15

అమెజాన్‌ ప్రైమ్‌.. 

కెల్సే (హాలీవుడ్‌) సెప్టెంబరు 12

ది కిడ్నాపింగ్‌ డే (కొరియన్‌ సిరీస్‌)

డిస్నీ+హాట్‌స్టార్‌.. 

యానిమల్స్‌ అప్‌క్లోజ్‌ (డాక్యుమెంటరీ) సెప్టెంబరు 13

ది అదర్‌ బ్లాక్‌ గర్ల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 15

హాన్‌ రివర్‌పోలీస్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 13

కాలా (హిందీ) సెప్టెంబరు 15

అతిథి (తెలుగు సిరీస్‌) సెప్టెంబరు 16

ఈటీవీ విన్‌..

దిల్‌ సే (తెలుగు) సెప్టెంబరు 16

సోనీలివ్‌.. 

జర్నీ ఆఫ్‌ లవ్‌ 18 ప్లస్‌(మలయాళం)సెప్టెంబరు 15

బుక్‌ మై షో.. 

బార్బీ (హాలీవుడ్) సెప్టెంబరు 12

ఏ హనీమూన్‌ టూ రిమెంబర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 15

 

Exit mobile version