Upcoming Releases : ఈ వారం కూడా పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే నవంబర్ మొదటి వారంలో పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ.. చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు (Upcoming Releases)..
కీడా కోలా..
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. వైవిధ్యభరిత చిత్రలత ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తరుణ్.. నటుడిగా ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికి డైరెక్టర్ గా మాత్రం బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన `కీడా కోలా` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. చైతన్య రావు, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. క్రైమ్, కామెడీ జోనర్లో నడిచే ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. హీరో రానా సమర్పణలో వివేక్ సుధాన్షు, శ్రీకృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మా ఊరి పొలిమేర 2..
సత్యం రాజేష్, కామాక్షి, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. అనిల్ విశ్వనాథ్ దర్శకుడుగా కరోనా టైమ్ లో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. చివరి 20 నిమిషాలు ప్రేక్షకులు షాక్ అయ్యారని చెప్పాలి. ఇప్పుడు ‘మా ఊరి పొలిమేర 2’ ను మొదటి భాగానికి మించి థ్రిల్‌ను పంచేలా తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. నవంబరు 3న ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
విధి..
రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విధి’ (Vidhi). నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీదుగా రంజిత్. ఎస్ నిర్మించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
12th ఫెయిల్..
విక్రాంత్ మస్సే హీరోగా, విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్’. మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అనురాగ్ పాఠక్ రాసిన నవలల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన వాటిల్లో ‘12 ఫెయిల్’ ఒకటి. ఇప్పుడు అదే పేరుతో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఘోస్ట్..
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. శ్రీని దర్శకత్వంలో లేటెస్ట్ గా ఆయన నటించిన చిత్రం ‘ఘోస్ట్’. సందేశ్ నాగరాజ్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సందడి చేయనుంది. అయితే ఇప్పటికే దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఘోస్ట్ తో శివన్న తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తారో చూడాలి. క్లైమాక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’ అని చిత్ర బృందం చెబుతోంది.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/వెబ్ సిరీస్‌ల వివరాలు (Upcoming Releases)..
నెట్‌ఫ్లిక్స్..
లాక్‌డ్ ఇన్ (హాలీవుడ్) నవంబరు 1
జవాన్ (హిందీ) నవంబరు 2
అమెజాన్ ప్రైమ్..
పి.ఐ. మీనా (హిందీ) నవంబరు 3
డిస్నీ+హాట్‌స్టార్..
స్కంద (తెలుగు) నవంబరు 2
ఆహా..
ఆర్ యూ ఓకే బేబీ (తమిళ్) అక్టోబరు 31
సోనీలివ్..
స్కామ్ 2003: పార్ట్-2 (హిందీ) నవంబరు 3