Upcoming Releases : ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏవంటే ?

జూలై నెలలో వచ్చిన చిన్న చిత్రాలు ఊహించని రీతిలో ఘన విజయాలు సాధిస్తున్నాయి. మొదటి వారంలో సామజవరగమణ మంచి హిట్ సాధించగా.. రెండో వారంలో వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హాట్ గా ననిలిచింది. ఈ క్రమంలోనే ఈ వారంలో కూడా పలు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 05:28 PM IST

Upcoming Releases : జూలై నెలలో వచ్చిన చిన్న చిత్రాలు ఊహించని రీతిలో ఘన విజయాలు సాధిస్తున్నాయి. టాలీవుడ్ లో మొదటి వారంలో సామజవరగమణ మంచి హిట్ సాధించగా.. రెండో వారంలో వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హాట్ గా ననిలిచింది. ఈ క్రమంలోనే ఈ వారంలో కూడా పలు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి. వీటికి పోటీగా హాలీవుడ్ మూవీ కూడా ఉండడం ఈ వారం మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ అని చెప్పాలి. మరి ఈ తరుణంలోనే ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్‌ వేదికగా విడుదలయ్యే చిత్రాలు (Upcoming Releases)..

హిడింబ..

అశ్విన్‌ బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. ఈ చిత్రానికి అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించగా.. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాతగా చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి అమంచి రెస్పాన్స్ లభించగా.. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి అశ్విన్ ఈ మూవీతో ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో అని..

అన్నపూర్ణ ఫొటో స్టూడియో..

చెందు ముద్దు దర్శకత్వంలో చైతన్య రావ్‌, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’.  యష్‌ రంగినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ కథ 90వ దశకంలో సాగుతుంది. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుందని మూవీ యూనిట్ అభిప్రాయపడుతున్నారు. జూలై 21న ఈ సినిమా విడుదల కానుంది.

హత్య..

ప్రముఖ హీరో విజయ్ ఆంటోని ఇటీవలే ‘బిచ్చగాడు-2’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. (Upcoming Releases) ఇప్పుడు అదే జోష్ లో ‘హత్య’ చిత్రంతో థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని బాలాజీ కుమార్‌ తెరకెక్కించారు. రితికా సింగ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు గా చేస్తున్న ఈ మూవీ ఈ నెల 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది.

ఓపెన్ హైమర్‌..

ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓపెన్ హైమర్‌’. హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రముఖ భౌతికశాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్‌ ఒప్పెన్‌ హైమర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను నాటకీయ కోణంలో చూపించనున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ లేకుండా ఈ సినిమాను రూపొందించడం విశేషం. జూలై 21న ఈ చిత్రం విడుదల కానుంది.

హెచ్‌.ఇ.ఆర్‌..

రుహానీ శర్మ కీలక పాత్రలో శ్రీధర్‌ స్వరాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హెచ్‌.ఇ.ఆర్‌.’ రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇందులో రుహానీ శక్తిమంతమైన ఓ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆసక్తికర, కథా, కథనాలతో సినిమా సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది.

అలా ఇలా ఎలా..

ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్‌ హీరోగా రాఘవ తెరకెక్కించిన చిత్రం ‘అలా ఇలా ఎలా’. కొల్లకుంట నాగరాజు నిర్మాత. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. ఈ సినిమా జులై 21న థియేటర్లలోకి రానుంది. ‘‘ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. స్క్రీన్‌ప్లే చాలా బాగా వచ్చింది. అందరూ ఈ చిత్రం చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం’’ అని చిత్ర బృందం చెబుతోంది.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు (Upcoming Releases)..

నెట్‌ఫ్లిక్స్‌..

ది డీపెస్ట్‌ బ్రెత్‌ (హాలీవుడ్) జులై 19

స్వీట్‌ మంగోలియాస్‌ (వెబ్‌సిరీస్‌3) జులై 20

దే క్లోన్‌డ్‌ టైరోన్‌ (హాలీవుడ్‌) జులై 21

అమెజాన్‌ ప్రైమ్‌..

బవాల్‌ (హిందీ) జులై 21

జియో సినిమా..

ట్రయల్‌ పీరియడ్‌ (హిందీ) జులై 21

జీ5..

ఎస్టేట్‌ (తమిళ) జులై 16

స్పైడర్‌మాన్‌: ఎక్రాస్‌ ది స్పైడర్స్‌ వర్స్‌ (యానిమేషన్‌) జులై 18