Site icon Prime9

Yashoda: యశోద టీజర్ ఈ నెల 9న విడుదల అవ్వనుంది!

yashoda prime9news

yashoda prime9news

Tollywood: చాలా రోజుల నుంచి సమంత సోషల్ మీడియాకు, ఆమె అభిమానులకు దూరంగా ఉంటుంది. కారణం ఏం అయి ఉంటుందో తెలీదు. ప్రస్తుతం సమంతా నటిస్తున్న సినిమా “యశోద” ఈ సినిమాకు హరి హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవ్వనుంది. శ్రీ దేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. యశోద సినిమా టిజర్ ను సెప్టెంబర్ 9న సాయంత్రం 05 గంటల 49 నిముషాలకు విడుదల చేయనున్నారు.

చుట్టూ అమ్మాయిల మద్యలో సమంత కోపంగా కనిపిస్తున్న సినిమా కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా మన అందరి ముందుకు తొందరలోనే రానుంది.

Exit mobile version