Mahesh-Rajamouli Movie: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రానున్నట్టు గతంలోనే జక్కన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాపై రాజమౌళి తండ్రి, ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు నెట్టంట తెగ ట్రెండింగ్ లో ఉన్నాయి.
అంతకు మించి(Mahesh-Rajamouli Movie)
మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో రానున్న ప్రాజెక్ట్ ఒక అడ్వెంచరస్ మూవీ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాను రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడని, ఆర్‌ఆర్‌ఆర్‌ను మించి ఈ మూవీ ఉండనుందని ఆయన వెల్లడించాడు. ఇప్పటికే ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మహేశ్-రాజమౌళి కాంబోపై విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. ఇక ఆ తర్వాత మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 సినిమా పూర్తైన వెంటనే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా మహేశ్ సినిమా కోసం అమెరికాకు చెందిన క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఒప్పందం చేసుకున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. దానితో ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్లు పని చేయనున్నారని అర్థం అవుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ విజయంతో రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఆర్ఆర్ఆర్ ను మించి ఉంటుందని విజయేంద్రప్రదసాద్ అనడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంలో నిండిపోతున్నారు. అంతేకాకుండా జక్కన్నకు హాలీవుడ్ లెవల్ లో క్రేజ్ ఉంది కాబట్టి ఆయన చేస్తున్న చేయనున్న సినిమాల గురించి తెలుసుకునేందుకు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు.