Site icon Prime9

Vishwak Sen: యాక్షన్ కింగ్ కు షాకిచ్చిన విశ్వక్ సేన్

Vishwak Sen

Vishwak Sen

Tollywood: యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ అయిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. పేరు పెట్టని ఈ చిత్రంలో అర్జున్  సర్జా కూతురు  హీరోయిన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు. ఒక షెడ్యూల్ కూడ పూర్తయింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని ప్రకారం విశ్వక్ సేన్ ఈ సినిమా నుంచి వాక్ అవుట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కారణాలు మాత్రం తెలియలేదు.

అర్జున్ సర్జ మరియు బృందం ఫిలిమ్స్ ఛాంబర్ ను సంప్రదించి విశ్వక్ సేన్ పై కంప్లైంట్ నమోదు చేసేందుకు సిద్దమయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న విశ్వక్ సేన్ పై ఇప్పుడు మరో వివాదం మొదలైంది. విశ్వక్ ఈ మధ్యనే “ఓరి దేవుడా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన “ఓ మై కడవులే” సినిమాకి రీమేక్ గా తనకెక్కిన ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటించగా వెంకటేష్ దేవుని పాత్రలో కనిపించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు పొందింది. మరోవైపు విశ్వక్ సేన్ గామి, దాస్ కా ధమ్కీ సినిమాలు చేస్తున్నారు.

 

Exit mobile version