Site icon Prime9

Balakrishna: వీరసింహారెడ్డి మూవీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

veera-simha-reddy-movie-update

veera-simha-reddy-movie-update

Balakrishna: బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య కేరాఫ్ అడ్రెస్ గా చెప్పవచ్చు. ఆ కథలతో వచ్చిన ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలిచాయి. కొంత గ్యాప్ తరువాత ఆయన మరల అదే తరహా సినిమా చేస్తున్నారు. కెరీయర్ పరంగా బాలయ్యకి ఇది 107వ సినిమా.

బాలయ్య సరసన శ్రుతి హాసన్ అలరించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చెయ్యడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 10:29 నిమిషాలకు ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ‘రాజసం నీ ఇంటి పేరు’ అంటూ ఫస్టు సింగిల్ కొనసాగనుంది. చూస్తుంటే ఇది బాలయ్య ఇంట్రడక్షన్ సాంగ్ అనిపిస్తోంది. ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటిస్తున్న ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

ఇదీ చదవండి: కమల్ హాసన్ అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి తరలింపు ?

Exit mobile version